Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

3 సార్లు: ఆసీస్‌పై తక్కువ లక్ష్యంతో విజయం సాధించిన భారత్

హైదరాబాద్: బెంగుళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. కేవలం 188 పరుగుల విజయ లక్ష్యాన్ని టీమిండియా కాపాడుకుని విజయం సాధించడం అనేది కొత్తేమీ కాదు. అయితే ఈ టెస్టు విజయం మాత్రం టీమిండియాకు ఎంతో ప్రత్యేకం.

ఎందుకంటే నాలుగు టెస్టుల సిరిస్‌లో భాగంగా పూణెలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 333 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. దీంతో భారత ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. ఇక బెంగుళూరు టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 189 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత జట్టుపై అన్నివైపుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.

ఇలాంటి సమయంలో బెంగుళూరు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా అనూహ్యంగా పుంజుకుంది. బ్యాటింగ్‌కు కష్టంగా మారిన పిచ్‌పై అద్భుతాన్ని చేసింది. టార్గెట్ స్వల్ప లక్ష్యమే అయినా ప్రత్యర్ధి జట్టుని ఒత్తిడికి గురి చేసి 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

India beat Australia by 75 runs in 2nd Test in Bangalore: India level series 1-1

గతంలో కూడా రెండు సార్లు ఆస్ట్రేలియాకు తక్కువ లక్ష్యాన్ని నిర్దేశించిన కూడా భారత్ విజయం సాధించింది. మొట్టమొదటిసారి 1981లో మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ)లో 143 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన భారత్ 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది.

ఆ టెస్టులో ఆస్ట్రేలియాను రెండో ఇన్నింగ్స్‌లో 83 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆ తర్వాత 2004లో ముంబైలోని వాంఖేడ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో 107 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియాకు నిర్దేశించింది. ఆ టెస్టులో కూడా ఆసీస్‌ను 93 పరుగులకే ఆలౌట్ చేసి 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఇలా 200 పరుగుల లోపు స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుని టీమిండియా గెలవడం ఇది ఐదోసారి. బెంగుళూరు టెస్టు విజయంతో ఆస్ట్రేలియాపై మూడుసార్లు, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌పై ఒకసారి టీమిండియా విజయం సాధించింది.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+