Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వేటు వేయొద్దని సెలక్షన్‌ కమిటీ సభ్యుడికి బంగర్ బెదిరింపులు

Sanjay Bangar Had 'Heated Exchange' With Selectors || Oneindia Telugu
India batting coach Sanjay Bangar warned selector Devang Gandhi


ఢిల్లీ: తనపై వేటు వేయొద్దని సెలక్షన్‌ కమిటీ చెందిన ఓ సభ్యుడిపై టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బీసీసీఐలో ఒక్కసారిగా అలజడి రేగింది. అయితే ఈ ఘటన రెండు వారాల కింద జరగగా.. లేటుగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం క్రికెట్‌ పాలకుల కమిటీ అధినేత వినోద్‌ రాయ్‌ దృష్టికి చేరింది. మరోవైపు నిజానిజాలు ఏమిటో తెలుసుకొనేందుకు ఇప్పటికే బీసీసీఐ ప్రయత్నాలు మొదలుపెట్టిందని సమాచారం తెలుస్తోంది.
 ప్రయోగాలకు బంగరే కారణం:

ప్రయోగాలకు బంగరే కారణం:

టీమిండియాను చాలా కాలంగా నంబర్‌ 4 సమస్య వెంటాడుతోంది. పరిస్థితులకు తగినట్టు నాలుగో స్థానంలో ఆడే ఆటగాడి కోసం టీమిండియా నాలుగేళ్లుగా ఎదురుచూస్తోంది. శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, కేఎల్‌ రాహుల్‌, అంబటి రాయుడు ఇలా చాలా మందిని ఆ స్థానంలో పరీక్షించింది. చివరకు అంబటి రాయుడు కుదురుకున్నాడు. అయితే ఆసీస్ ఒక్క సిరీస్‌లోనే తడబడ్డ రాయుడును ప్రపంచకప్‌కు ఎంపికచేయలేదు. అతని స్థానంలో విజయ్‌ శంకర్‌కు చోటిచ్చారు. బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగరే ఈ ప్రయోగాలకు ముఖ్య కారకుడు.

అప్పుడే బంగర్ పదవికి ఎసరు:

అప్పుడే బంగర్ పదవికి ఎసరు:

ప్రపంచకప్‌లో నాలుగో స్థానంలో సరైన ఆటగాడు లేని కారణంగా టీమిండియా సెమీస్ నుండి నిష్క్రమించింది. ఇక ఎంఎస్‌ ధోనీని ముందు పంపకుండా ఏడో స్థానంలో ఆడించడానికి ఆయనే కారణమని తెలిసింది. దీంతో బంగర్ పదవికి ఎసరు వచ్చింది. ప్రపంచకప్‌తో రవిశాస్త్రి, బంగర్‌, భరత్‌ అరుణ్‌, శ్రీధర్‌ పదవీకాలం ముగిసింది. ఇదే సమయంలో విండీస్ పర్యటన ఉండడంతో.. వారికి 45 రోజుల గడువును పొడగించారు. మరోవైపు బీసీసీఐ వీరి పదవులకు దరఖాస్తులు ఆహ్వానించింది.

బంగర్‌పై వేటు:

బంగర్‌పై వేటు:

కపిల్‌ దేవ్‌ నేతృత్వంలోని క్రికెట్‌ సలహా కమిటీ మళ్లీ శాస్త్రికే ఓటేసింది. ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ ఎంపిక ప్రక్రియను చేపట్టింది. ప్రసాద్‌ కమిటీ భరత్‌ అరుణ్‌, శ్రీధర్‌లను కొనసాగించి బంగర్‌పై వేటు వేశారు. బంగర్‌ స్థానంలో విక్రమ్‌ రాఠోడ్‌ను బ్యాటింగ్‌ కోచ్‌గా ఎంపిక చేశారు.

సెలక్షన్‌ కమిటీ సభ్యుడుకి బెదిరింపులు:

సెలక్షన్‌ కమిటీ సభ్యుడుకి బెదిరింపులు:

రెండు వారాల క్రితం ఓ హోటల్‌లో బస చేస్తున్న సెలక్షన్‌ కమిటీ సభ్యుడు దేవాంగ్‌ గాంధీ గదికి బంగర్‌ వెళ్లాడు. అక్కడ ఆయనతో అమర్యాదకరంగా ప్రవర్తించాడు. జట్టు తనకు అండగా ఉందని చెపుతూ ఆయనను బెదిరించాడు. అంతేకాదు తనను తొలగించాలన్న నిర్ణయాన్ని వారు ఒప్పుకోరని హెచ్చరించాడు. బ్యాటింగ్‌ కోచ్‌గా ఎంపిక చేయకుంటే.. జాతీయ క్రికెట్‌ అకాడమీలో ఏదో ఒక పదవి ఇప్పించాలని బెదిరించాడు. ఈ విషయం సీఓఏ అధినేత వినోద్‌ రాయ్‌ దృష్టికి వెళ్ళింది. నిజానిజాలు ఏమిటో తెలుసుకొనేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Story first published: Wednesday, September 4, 2019, 16:15 [IST]
Other articles published on Sep 4, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+