న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రాక్టీస్ సరిపోదు ఇంకొక రోజు పెంచండి: బీసీసీఐ

India batting coach Bangar sent to Sydney to help Test specialists

హైదరాబాద్: ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా ముందుగా మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడుతోంది. ఈ షార్ట్ ఫార్మాట్ అనంతరం డిసెంబర్‌ 6నుంచి అడిలైడ్‌ వేదికగా ఇరు జట్ల మధ్య టెస్టు సిరీస్‌ మొదలుకానుంది. ఈ టీ20 సిరీస్‌ ముగిసిన వెంటనే టీమిండియా ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియా ఎలెవన్‌ జట్టుతో ఓ సన్నాహాక మ్యాచ్‌ ఆడనున్న సంగతి తెలిసిందే. ముందుగా అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం ప్రాక్టీస్‌ మ్యాచ్‌ 3 రోజులు మాత్రమే జరగాలి.

ప్రాక్టీస్‌ సెషన్‌కు ఇంకాస్త ఎక్కువ సమయం

ప్రాక్టీస్‌ సెషన్‌కు ఇంకాస్త ఎక్కువ సమయం

దానిని బట్టి నవంబర్‌ 29న మొదలై.. డిసెంబర్‌ 1న ముగియనుంది. ఆస్ట్రేలియా వంటి జట్టుతో తలపడే ముందు ప్రాక్టీస్‌ సెషన్‌కు ఇంకాస్త ఎక్కువ సమయం ఉండాలని బీసీసీఐ భావించింది. దీంతో మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌కు మరో రోజును అదనంగా కేటాయించాలని క్రికెట్‌ ఆస్ట్రేలియాను కోరినట్లు తెలిసింది.

అభ్యర్థన మేరకు సన్నాహాక మ్యాచ్‌

అభ్యర్థన మేరకు సన్నాహాక మ్యాచ్‌

‘బీసీసీఐ అభ్యర్థన మేరకు సన్నాహాక మ్యాచ్‌ నాలుగు రోజులు జరగనుంది. ప్రాక్టీస్‌ సెషన్‌కు ఇంకొంత సమయం కోసమని ఈ మ్యాచ్‌ నవంబర్‌ 28నుంచి ఆరంభం కానుంది.' అని సీఏ అధికారి పేర్కొన్నారు.

ప్రాక్టీస్‌ మ్యాచ్‌ కోసమని మంగళవారమే

ప్రాక్టీస్‌ మ్యాచ్‌ కోసమని మంగళవారమే

ప్రస్తుతం న్యూజిలాండ్‌లో భారత్‌-ఏ జట్టుకు ఆడుతున్న అజింక్యా రహానె, పృథ్వీషా, హనుమ విహారి, మురళీ విజయ్‌, పార్ధీవ్‌ పటేల్‌ కూడా ఆస్ట్రేలియా ఎలెవన్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ కోసమని మంగళవారమే ఇక్కడికి చేరుకున్నారు. ఇదిలా ఉంటే టెస్టు స్పెషలిస్టులతో పాటు యువ ఆటగాళ్లైన పృథ్వీ షా, హనుమ విహారికి ప్రత్యేక శిక్షణ కోసమని టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ ముందుగానే సిడ్నీకి చేరుకున్నారు.

ఆసీస్ గడ్డపై ఆడేందుకు పృథ్వీ ప్రత్యేక శిక్షణ

ఆసీస్ గడ్డపై ఆడేందుకు పృథ్వీ ప్రత్యేక శిక్షణ

‘పృథ్వీ, హనుమ విహారికి ఆసీస్‌ గడ్డపై ఇదే తొలి పర్యటన. ఈ క్రమంలో ఇక్కడి పిచ్‌లకు అలవాటు పడటానికి, ఆసీస్‌ పేసర్లను దీటుగా ఎదుర్కొవడానికిగానూ నవంబర్‌ 25వరకు వారు సంజయ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటారు. రహానె, మురళీ విజయ్‌, పార్ధీవ్‌ పటేల్‌కు కూడా ఈ సెషన్‌లో పాల్గొంటారు' బీసీసీఐ అధికారి తెలిపారు. అలాగే పేసర్లు షమి, ఇషాంత్‌ శర్మ కూడా త్వరలోనే ఆస్ట్రేలియాకు చేరుకొని నెట్స్‌లో ప్రాక్టీస్‌ మొదలుపెడతారని ఆయన పేర్కొన్నారు.

Story first published: Wednesday, November 21, 2018, 17:55 [IST]
Other articles published on Nov 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X