Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : అదరగొట్టిన అశ్విన్.. ధాటిగా ఆడుతున్న టీమిండియా ఓపెనర్లు

India batters fighting after Ashwin miracle in fourth test

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అదరగొట్టాడు. రెండో రోజు ఆట మొదలైనప్పటి నుంచే అద్భుతంగా బౌలింగ్ చేసిన అతను.. వీలు చిక్కినప్పుడల్లా వికెట్లు తీస్తూ భారత్‌ను పోటీలోకి తీసుకొచ్చాడు. దీంతో ఆసీస్ జట్టు 480 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బరిలో దిగిన భారత్ కూడా ధాటిగానే ఆడింది.

రాణించిన ఆసీస్ బ్యాటింగ్

రాణించిన ఆసీస్ బ్యాటింగ్

ఉస్మాన్ ఖవాజా (180) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఒకానొక దశలో అతను డబుల్ సెంచరీ చేసేలా కనిపించాడు. అతనికి జతగా యువ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ (114) టెస్టుల్లో తన తొలి శతకం సాధించాడు. అది కూడా భారత్‌లో చేయడం ఈ శతకాన్ని మరింత స్పెషల్ చేస్తుందని మాజీలు కూడా కొనియాడారు. వీళ్లిద్దరూ కలిసి ఆస్ట్రేలియా స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అయితే అశ్విన్ ఈ జోడీని విడదీశాడు. అతను వేసిన 131వ ఓవర్లో స్వీప్ షాట్ ఆడబోయిన గ్రీన్ అవుటయ్యాడు.

అదే ఓవర్లో క్యారీ (0) కూడా పెవిలియన్ చేరాడు.

వరుస పెట్టి వికెట్లు తీసుకున్న అశ్విన్..

వరుస పెట్టి వికెట్లు తీసుకున్న అశ్విన్..

ఆ తర్వాత వచ్చిన మిచెల్ స్టార్క్ (6)ను కూడా అశ్విన్ పెవిలియన్ చేర్చాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఖవాజా కూడా ఎల్బీగా వెనుతిరిగాడు. అయితే అనంతరం జోడీ కట్టిన నాథన్ లియాన్ (34), టాడ్ మర్ఫీ (41) ఇద్దరూ మరో వికెట్ పడనివ్వలేదు. కొత్త బంతితో అశ్విన్ మళ్లీ తన టాలెంట్ చూపించాడు. మర్ఫీని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. ఆ తర్వాత కునేమన్ (0 నాటౌట్)తో కలిసి కొంచెం గట్టిగా ఆడేందుకు లియాన్ ప్రయత్నించాడు. అయితే మరో పది ఓవర్ల ఆట ఉందనగా అశ్విన్ బౌలింగ్‌లో లియాన్ కూడా అవుటయ్యాడు. దీంతో ఆసీస్ ఇన్నింగ్స్ 480 పరుగుల వద్ద ముగిసింది.

భారత్ కూడా ధాటిగానే..

భారత్ కూడా ధాటిగానే..

ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత భారత జట్టు కేవలం పది ఓవర్లు మాత్రమే ఆడగలిగింది. ఆ తర్వాత రెండో రోజు ఆట ముగిసింది. ఈ పది ఓవర్లలో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ (17 నాటౌట్), శుభ్‌మన్ గిల్ (18 నాటౌట్) కూడా ధాటిగా ఆడారు. కునేమన్ వేసిన పదో ఓవర్ రెండో బంతికి గిల్ భారీ సిక్సర్ బాదాడు. అదే ఈ మ్యాచ్‌లో తొలి సిక్సర్ కావడం గమనార్హం. అవకాశం చిక్కినప్పుడల్లా వీళ్లిద్దరూ బౌండరీలు బాదుతూ ఉండటంతో భారత జట్టు స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్లేమీ కోల్పోకుండా 36 పరుగులు చేసింది.

Story first published: Friday, March 10, 2023, 17:08 [IST]
Other articles published on Mar 10, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+