Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వన్డే కెప్టెన్లు: వయసూ ఎక్కువే, వన్డేలు అత్యధికం

ఢాకా: బంగ్లాదేశ్, భారత్‌ల మధ్య జరుగుతున్న తొలి వన్డేలో బంగ్లాదేశ్ కెప్టెన్ మష్రఫీ మొర్తాజా, టీమిండియా కెప్టెన్ ధోని ఇద్దరు కూడా 30 ఏళ్లకు పైబడిన వారే కావడం విశేషం. అంతేకాదు ఇరు జట్లలో అత్యధిక వయసున్న ఆటగాళ్లు కూడా వీరే.

ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వయసు 33 ఏళ్లుకాగా, మొర్తాజా వయసు 31 ఏళ్లు. దీంతో పాటు జట్టులోని మిగతా ఆటగాళ్లతో పోలిస్తే వీరిద్దరూ అత్యధిక వన్డే మ్యాచ్‌లు ఆడారు.

India, Bangladesh captains both age above 30 years

మహేంద్ర సింగ్ ధోని టీమిండియా తరుపున 263 వన్డేలు ఆడగా, మొర్తాజా 152 వన్డే మ్యాచ్‌లాడారు. ఇక బంగ్లాదేశ్, భారత్‌ల మధ్య జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ మొర్తాజా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ఆస్టేలియాలో జరిగిన వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో ఓటమి తర్వాత ఇరు జట్లు తొలిసారి తలపడుతున్నాయి. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా తొలి మ్యాచ్ జూన్ 18 (గురువారం) ప్రారంభమైంది. వర్షం ముప్పు పొంచి ఉండటంతో మూడు మ్యాచ్‌లు కూడా డే/నైట్ నిర్వహిస్తున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+