హైదరాబాద్: భారత్-ఆస్ట్రేలియా సిరీస్‌లో ఐసీసీ పాత నిబంధనలే ఉపయోగించనుంది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 13 వరకు జరిగే భారత పర్యటనలో భాగంగా ఆసీస్ ఐదు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడనుంది. ఐసీసీ కొత్త నిబంధనలు సెప్టెంబర్ 28 నుంచి అమల్లోకి వస్తున్నా ఈ సిరీస్ మధ్యలో వాటిని ప్రవేశపెట్టడం లేదు.
ఆటగాళ్ల క్రమశిక్షణ నియమావళి, డీఆర్‌ఎస్ వినియోగం, బ్యాట్ సైజ్ వంటి వాటిపై ఐసీసీ కొత్తగా కొన్ని నిబంధనలను విధించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 1 నుంచి ఈ నిబంధనలన్నీ అమల్లోకి రానున్నాయి. అయితే సెప్టెంబర్ 28 నుంచి జరిగే బంగ్లాదేశ్-దక్షిణాఫ్రికా; పాకిస్థాన్-శ్రీలంక సిరీస్ నుంచి కొత్త నిబంధనలు పూర్తిస్థాయిలో అమల్లోకి రానున్నాయి.

ఈ మేరకు ఐసీసీ తాజాగా నిర్ణయం తీసుకుంది. భారత్, ఆసీస్ సిరీస్ దీనికంటే ముందే మొదలవుతుంది. కాబట్టి ఇందులో పాత నిబంధనలే ఉంటాయి. సిరీస్ మధ్యలో కొత్త నిబంధనలను తీసుకొస్తే గందరగోళం తలెత్తుంది. దీనిపై ఐసీసీ తుది నిర్ణయం తీసుకుంటుంది అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
భారత్‌లో ఆస్ట్రేలియా జట్టు పర్యటన షెడ్యూల్:
1st ODI
Sept.17, Venue - MA Chidambaram Stadium, Chennai, Time - 1:30 PM (IST)
2nd ODI
Sept.21, Venue - M Chinnaswamy Stadium, Bengaluru, Time - 1:30 PM (IST)
3rd ODI
Sept.24, Venue - Vidarbha Cricket Association Ground, Nagpur, Time - 1:30 PM (IST)
4th ODI
Sept.28, Venue - Holkar Stadium, Indore, Time - 1:30 PM (IST)
5th ODI
Oct.1, Venue - Eden Gardens, Kolkata, Time - 1:30 PM (IST)
India vs Australia T20I Series Schedule
1st T20I
Oct. 7, Venue - Rajiv Gandhi International Stadium, Hyderabad, Time - 7 PM (IST)
2nd T20I
Oct. 10, Venue - JSCA International Stadium Complex, Ranchi, Time - 7 PM (IST)
3rd T20I
Oct. 13, Venue - Nehru Stadium, Guwahati, Time - 7 PM (IST)

భారత పర్యటనకు వచ్చే ఆస్ట్రేలియా జట్టు:
వన్డే జట్టు: స్టీవ్ స్మిత్(కెప్టెన్), డేవిడ్ వార్నర్(వైస్ కెప్టెన్), ఆస్టన్ అగర్, హిల్టన్ కార్డ్‌రైట్, నాధన్ కౌల్టర్ నైల్, కమిన్స్, జేమ్స్ ఫాల్కనర్, అరోన్ ఫించ్, హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, అడమ్ జంపా.
టీ20 జట్టు: స్టీవ్ స్మిత్(కెప్టెన్), డేవిడ్ వార్నర్(వైస్ కెప్టెన్), జాసన్ బెహ్రెన్‌డోర్ఫ్, డాన్ క్రిస్టియన్, నాధన్ కౌల్టర్ నైల్, కమిన్స్, అరోన్ ఫించ్, ట్రావిస్ హెడ్, మొయిస్ హెన్రిక్స్, మ్యాక్స్‌వెల్, టిమ్ పైని, కేన్ రిచర్డ్‌సన్, అడమ్ జంపా.