Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

న్యూజిలాండ్‌తో టెస్ట్‌లు: టీమిండియా ఇదే.., రోహిత్‌పై సుదీర్ఘ చర్చ

ముంబై: న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. జట్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. సోమవారం ఉదయం సెలక్షన్ కమిటీ సమావేశమైంది. ఆటగాళ్లను ఎంపిక చేసింది.

గత కొద్దికాలంగా రాణించలేకపోతున్న రోహిత్ శర్మను తొలగిస్తారన్న వార్తలు వచ్చాయి. కానీ అతనికి జట్టులో చోటు లభించింది.

India at full strength for New Zealand Tests

టెస్ట్ జట్టులో రోహిత్‌ శర్మ ఎంపికపై సెలక్షన్‌ కమిటీలో ఎక్కువ సమయం చర్చ కొనసాగింది. టెస్టుల్లో రోహిత్‌ రికార్డు ఆశించిన స్థాయిలో లేదు. 18 టెస్ట్‌లాడిన రోహిత్‌ ఇప్పటి వరకు టెస్ట్‌ల్లో నిలకడలేమితో తుది జట్టులోకి వస్తూ పోతూ ఉన్నాడు.

విండీస్‌ పర్యటనలో రెండు టెస్టులాడేందుకు అవకాశం రాగా మూడో టెస్ట్‌లో తక్కువ పరుగులకే రోహిత్‌ అవుటయ్యాడు. కెప్టెన్‌ కోహ్లి మద్దతుతో రోహిత్‌ తుది జట్టులో స్థానం సంపాదించాడు. యువ ఆటగాళ్ల నుంచి పుజారా, అమిత్‌ మిశ్రా పోటీ ఎదుర్కొని జట్టులో స్థానం పదిలం చేసుకున్నారు.

జట్టు ఇదే.. విరాట్ కోహ్లీ (కెప్టెన్), కెఎల్ రాహుల్, చటేశ్వర పుజారా, అజింక్యా రహానే, మురళీ విజయ్, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, వృద్ధిమాన్ సాహా, రవీంద్ర జడేజా, షమీ, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, శిఖర్ ధావన్, అమిత్ మిశ్రా, ఉమేష్ యాదవ్.

భారత్ - న్యూజిలాండ్ దేశాల మధ్య తొలి టెస్ట్ ఈ నెల 22 నుంచి కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్‌లో జరగనుంది. అనంతరం 30 నుంచి అక్టోబర్ 4 వరకూ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రెండో టెస్ట్, చివరి టెస్ట్ ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరగనుంది. భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య మూడు టెస్ట్‌లు, 5 వన్డేలు జరగనున్నాయి.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+