Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లాండ్ జట్టుపై విజయం మాదే: రవీంద్ర జడేజా

India are only side which can beat England in England: Ravindra Jadeja

హైదరాబాద్: టీమిండియా క్రికెటర్లు ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌పై పూర్తి విశ్వాసంతో ఉన్నారు. సిరీస్ గెలుచుకోవాలనే కసితో ఉన్న ఆటగాళ్లు కప్ గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. ఇంగ్లాండ్‌ గడ్డ మీద ఇంగ్లిష్‌ జట్టుపై పూర్తి ఆధిపత్యం తమదేనని అంటున్నాడు భారత స్పిన్నర్‌ రవీంద్ర జడేజా. 2014లో తాము ఇంగ్లాండ్‌లో పర్యటించిన సమయంలో జట్టులో ఎక్కువ మంది ఆటగాళ్లకు టెస్టుల్లో ఆడిన అనుభం తక్కువగా ఉందని, ఇప్పుడు చాలా మంది అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారన్నాని తెలియజేశాడు.

దీంతో పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తామని జడేజా ధీమా వ్యక్తం చేశాడు. భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య టెస్టు సిరీస్‌ ప్రారంభంకానున్న నేపథ్యంలో జడేజా మీడియాతో మాట్లాడాడు. 'ఏమైనా జరగొచ్చు. కుల్దీప్ ఇటీవల చాలా చక్కగా ఆడుతున్నాడు. జట్టులో ఒకేసారి ఇద్దరు ఎడమచేతి స్పిన్నర్లను తీసుకోనూ వచ్చు.' అని జడేజా తెలిపాడు. నాలుగేళ్లు క్రితం మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ను కోల్పోయిన టీమిండియా ఈ సారి పటిష్టమైన జట్టుతో తిరిగొచ్చింది అన్నాడు.

1
42374

'ప్రస్తుతం జట్టులో ఉన్న ఎక్కువ మంది ఆటగాళ్లకు 25-30 టెస్టులు ఆడిన అనుభవం ఉంది. ఈ అనుభవం ఎంతో ఉపయోగపడుతోంది. మా జట్టులో మంచి బౌలర్లు ఉన్నారు. 2014లో పరిస్థితి వేరు. అప్పుడు మాకు తగిన అనుభవం లేదు. ఇక్కడి వికెట్లపై కూడా అంత అవగాహన లేదు. ఇప్పుడు ఇక్కడి పరిస్థితులను, వికెట్లను అర్థం చేసుకోగలుగుతున్నాం. ఈ సారి ఇంగ్లిష్‌ గడ్డ మీద ఇంగ్లాండ్‌ జట్టుపై పూర్తి ఆధిపత్యం భారత్‌దే' అని అనుకుంటున్నట్లు జడేజా చెప్పాడు.

'ఇంగ్లాండ్‌ జట్టుకు మంచి ఫాస్ట్‌ బౌలర్లు ఉన్నారు. సొంతగడ్డపై సిరీస్‌ జరగడం కూడా వారికి కలిసొచ్చే అంశమే. కానీ, మన జట్టులో కూడా బౌలర్లు ఉన్నారు. ఎవరైనా ఆటగాళ్లు గాయపడినా వారి స్థానాలను భర్తీ చేసేందుకు కూడా మంచి బౌలర్లు అందుబాటులో ఉన్నారు. ఇతర జట్లకు ఇలాంటి అవకాశం ఉండటం చాలా అరుదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఇంగ్లాండ్‌ను తమ సొంతగడ్డపై ఓడిస్తామని అనుకుంటున్నా' అని జడేజా తెలిపాడు.

Story first published: Wednesday, August 1, 2018, 14:59 [IST]
Other articles published on Aug 1, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+