వరల్డ్‌కప్ టోర్నీలో ఫేవరేట్ జట్లలో భారత్ ఒకటి: రాహుల్ ద్రవిడ్


హైదరాబాద్: ఈ ఏడాది మే నెలలో ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్ నాటికి టీమిండియా ఆట మరో స్థాయికి వెళుతుందని మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. ఇండియా-ఏ, ఇంగ్లాండ్ లయన్స్ జట్ల మధ్య ఐదో వన్డే ముగిసిన అనంతరం రాహుల్ ద్రవిడ్ మీడియాతో మాట్లాడాడు.
"ప్రస్తుతం టీమిండియా అద్భుతమైన క్రికెట్ ఆడుతోంది. వరల్డ్‌కప్ నాటికి టీమిండియా ఆట మరో స్థాయికి వెళుతుంది. ఈ టోర్నీలో ఫేవరెట్లలో భారత్ ఒకటి. రాబోయే కొన్ని నెలల్లో మన ఆట అత్యున్నత స్థాయికి చేరుతుంది. ఇంగ్లాండ్‌లో పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నాయి" అని ద్రవిడ్ చెప్పాడు.

భారీ స్కోర్లు నమోదు కావడం ఖాయం
"ఈసారి వరల్డ్ కప్‌లో భారీ స్కోర్లు నమోదు కావడం ఖాయం. ఇంగ్లాండ్-ఎతో మ్యాచ్‌లు ఆడినప్పుడు దాదాపు అన్ని మ్యాచ్‌ల్లోనూ జట్ల స్కోర్లు 300 పరుగులు దాటాయి. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన 1999 వరల్డ్‌కప్‌లో డ్యుక్ వైట్ బంతిని ఉపయోగించారు. అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ స్కోర్లు నమోదు అయ్యేలా కనిపిస్తున్నాయి" అని ద్రవిడ్ తెలిపాడు.

వరల్డ్‌కప్‌లో భారీ స్కోర్లు
తెలుపు రంగు కుకాబుర్రా బంతులు, ఫీల్డింగ్ నిబంధనల్లో మార్పులు ఇవన్నీ ఈ ఏడాది జరిగే వరల్డ్‌కప్‌లో భారీ స్కోర్లకు కారణమయ్యేలా కనిపిస్తున్నాయని ఇండియా-ఏ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. కాగా, తిరువనంతపురం వేదికగా ఇండియా-ఏతో గురువారం జరిగిన ఐదో వన్డేలో ఇంగ్లాండ్ లయన్స్ విజయం సాధించింది.

9 వికెట్ల తేడాతో విజయం
ఐదు వన్డేల సిరీస్‌లో 0-4తో వెనకబడిన ఆ జట్టు చివరి వన్డేలో 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-ఏ జట్టు 35 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (0), పంత్ (7) విఫలమయ్యారు. అనంతరం 122 పరుగుల లక్ష్యాన్ని 30.3 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications