Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసియా కప్ టీ20 టోర్నీ: సెలక్టర్లు ఎంపిక చేసిన భారత జట్టు ఇదే

India announces 15-member squad for Womens Asia Cup T20

హైదరాబాద్: ఆసియా కప్‌ టీ20 టోర్నీలో ఆడే భారత మహిళల జట్టుని బీసీసీఐ శనివారం ప్రకటించింది. 15 మందితో కూడిన భారత జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహించనుంది. మలేషియా ఆతిథ్యమిస్తోన్న ఈ టోర్నమెంట్ జూన్ 1 నుంచి 11 వరకు జరగనుంది. ఈ టీ20 టోర్నీలో భారత్, పాకిస్థాన్‌తో పాటు.. బంగ్లాదేశ్, శ్రీలంక, థాయ్‌లాండ్, మలేషియా కూడా పాల్గొంటాయి.

ప్రతి జట్టు వేరొక జట్టుతో ఒక మ్యాచ్ అడనుంది. పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న జట్లు ఫైనల్స్‌లో తలపడుతాయి. ఈ టీ20 టోర్నీలో అందరి దృష్టి వైస్ కెప్టెన్ స్మృతి మందానపై ఉంది. గతేడాది జరిగిన మహిళ వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన మందాన అప్పటి నుంచి తన ఫామ్‌ని అలాగే కొనసాగిస్తుంది.

దీంతో ఇటీవలే బీసీసీఐ మందాన పేరుని అర్జున అవార్డుకు కూడా సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. కాగా, బౌలింగ్‌లో కూడా భారత జట్టు బలంగానే ఉంది. జులన్ గోస్వామితో పాటు.. తాజాగా జట్టులో చేరిన పూజా వస్త్రాకర్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తోంది. దీంతో ఆసియా కప్ టీ20 టోర్నీలో భారత్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.

భారత జట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన(వైస్ కెప్టెన్), మిథాలీ రాజ్, జెమీయా రోడ్రిగ్యూస్, దీప్తీ శర్మ, అనుజా పాటిల్, వేదా కృష్ణమూర్తి, తనియా భాటియా(కీపర్), ఝులన్ గోస్వామి, పూజా వస్త్రాకర్, శిఖా పాండే, పూనమ్ యాదవ్, రాజేశ్వరీ గైక్వాడ్, ఏక్తా బిస్త్, మోనా మెశ్రామ్.

Story first published: Saturday, April 28, 2018, 15:18 [IST]
Other articles published on Apr 28, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+