Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైరల్ వీడియో: డీఆర్‌ఎస్‌లో పంత్ విఫలం.. తలకొట్టుకున్న రోహిత్!!

India vs Bangladesh 2019 : Rohit Sharma's Hilarious Reaction After Pant-Insisted DRS Goes Wrong
India and Bangladesh: Rohit Sharma funny Reaction after Rishabh Pant fails in DRS

ఢిల్లీ: ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు చేసిన భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ (42 బంతుల్లో 41; 3 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్ స్కోరర్. లక్ష చేధనలో బంగ్లాదేశ్‌ 19.3 ఓవర్లలో 3 వికెట్లకు 154 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ముష్ఫికర్‌ రహీమ్‌ (43 బంతుల్లో 60 నాటౌట్‌; 8 ఫోర్లు, 1 సిక్స్‌) విజయంలో కీలక పాత్ర పోషించాడు.

 అప్పీల్ చేసినా.. అంపైర్‌ ఔట్ ఇవ్వలేదు:

అప్పీల్ చేసినా.. అంపైర్‌ ఔట్ ఇవ్వలేదు:

ఢిల్లీ టీ20 మ్యాచ్‌తో సీనియర్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ స్థానాన్ని రిషభ్‌ పంత్‌ భర్తీ చేయలేడని తేలిపోయింది. తొలి టీ20 మ్యాచ్‌లో కీలక సమయంలో పంత్ వికెట్ల వెనుక పూర్తిగా విఫలమయ్యాడు. బంగ్లా బ్యాటింగ్‌ చేస్తుండగా స్పిన్నర్ చాహల్‌ వేసిన 10వ ఓవర్‌లో సౌమ్య సర్కార్‌ క్రీజులో ఉన్నాడు. చాహల్‌ వేసిన బంతి సౌమ్య బ్యాట్‌కు తాకీతాకనట్టు వెళ్లి నేరుగా పంత్‌ చేతుల్లో పడింది. భారత ఆటగాళ్లు అందరూ అప్పీల్ చేసినా.. అంపైర్‌ ఔట్ ఇవ్వలేదు.

 రోహిత్‌ను ఒప్పించి డీఆర్‌ఎస్‌కు వెళ్లిన పంత్:

రోహిత్‌ను ఒప్పించి డీఆర్‌ఎస్‌కు వెళ్లిన పంత్:

అంపైర్‌ ఔటివ్వకపోవడంతో బౌలర్ చాహల్‌కు పూర్తి స్పష్టత లేదు. కెప్టెన్ రోహిత్‌ శర్మ చాహల్‌ను అడగ్గా స్పష్టంగా చెప్పలేను అని సమాధానం ఇచ్చాడు. కీపర్ పంత్‌ను అడగ్గా.. కచ్చితంగా బ్యాట్‌కు బంతి తగిలింది అని చెప్పి రోహిత్‌ను ఒప్పించి డీఆర్‌ఎస్‌ కోరాడు. సమీక్షలో సౌమ్య బ్యాట్‌కు బంతి తగలలేదని స్పష్టంగా తేలడంతో భారత సమీక్ష వృథా అయ్యింది.

తలకొట్టుకున్న రోహిత్:

తలకొట్టుకున్న రోహిత్:

అంపైర్‌ నాటౌట్ ఇవ్వగానే పంత్‌ వైపు చూసిన రోహిత్ గట్టిగా నవ్వుకున్నాడు. ఇదే సమయంలో రోహిత్ తన చేతుతో తలకొట్టుకున్నాడు. ఆ సన్నివేశం చూడటానికి చాలా హాస్యాస్పదంగా ఉంది. మ్యాచ్ రిప్లైలో కూడా పదే పదే ఇదే చూపించారు. దీంతో మ్యాచ్ చూస్తున్న కొందరు అభిమానులు ఎంజాయ్ చేశారు. మరొకొందరేమో మండిపడ్డారు.

పంత్ ఏంటి ఇది:

దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'డీఆర్‌ఎస్‌ అంటే ధోనీ రివ్యూ సిస్టమ్‌ అని పంత్‌తో రోహిత్‌ అంటున్నాడు' అని ఓ అభిమాని కామెంట్ చేసాడు. 'పంత్ ఏంటి ఇది' అని మరో అభిమాని కామెంట్ చేసాడు. 'అనవసరదానికి డీఆర్‌ఎస్‌ను వృథా చేశాడు' అని పంత్‌పై మరో అభిమాని మండిపడ్డాడు.

 రహీమ్‌కు అవకాశం ఇచ్చాడు:

రహీమ్‌కు అవకాశం ఇచ్చాడు:

పంత్‌ అంతకుముందే మరో అవకాశాన్ని వదిలేశాడు. ముష్ఫికర్‌ రహీమ్‌ కుదురుకోకముందే ఎల్బీగా ఔట్ అయినా.. ఆ అవకాశాలను పంత్‌ వాటిని పసిగట్టడంలో విఫలమయ్యాడు. ఎల్బీగా ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ముఫ్ఫికర్‌ (60నాటౌట్‌; 43 బంతుల్లో 8x4, 1x6) అద్భుతంగా పోరాడి టీ20ల్లో టీమిండియాపై బంగ్లాకు తొలి విజయాన్ని అందించాడు.

Story first published: Monday, November 4, 2019, 11:41 [IST]
Other articles published on Nov 4, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+