
ఢిల్లీ: మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మరికొన్ని నిమిషాల్లో దేశ రాజధాని ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ టీ20 కెప్టెన్ మహ్మదుల్లా రియాద్ బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్ ఈ మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగుతోంది. బంగ్లా జట్టులో కొత్తవారికి అవకాశం దక్కింది.
ఇప్పటివరకు భారత్, బంగ్లా జట్లు ఎనిమిది టీ20ల్లో తలపడగా.. అన్ని సార్లు భారత్ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో బోణీ కొట్టాలని భారత్ చూస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా కెప్టెన్‌గా తన రికార్డును ముందుకు తీసుకెళ్లాలని రోహిత్ భావిస్తున్నాడు. మరోవైపు అన్ని రంగాల్లోనూ బలంగా ఉన్న భారత్‌ను ఓడించాలని బంగ్లాదేశ్ చూస్తోంది.
మ్యాచ్ జరగుతున్న అరుణ్‌జైట్లీ స్టేడియంలో అత్యధిక స్కోరు 202/3. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఈ స్కోరు చేసింది. ఈ మైదానంలో అత్యల్ప స్కోరు 142/7. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఈ స్కోరు సాధించింది. ప్రస్తుతం ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రస్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. పొగ, దుమ్మూ, ధూళీ, మంచు ఢిల్లీని సతమతం చేస్తున్నాయి.
భారత్, బంగ్లా జట్ల మధ్య జరిగే టీ20 1000వ టీ20 మ్యాచ్. దీంతో భారత్, బంగ్లా జట్లు చరిత్రలో నిలవనున్నాయి. ఇరు జట్లు ఈ చారిత్రక మ్యాచ్‌లో విజయం సాధించాలని చూస్తున్నాయి. మరి 1000వ టీ20 మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి. అయితే గెలిచిన జట్టు ఓ గొప్ప విజయంతో చరిత్రలో నిలిచిపోనుంది.
జట్లు:
భారత్:
రోహిత్ శర్మ (కెప్టెన్), రిషభ్‌పంత్ (వికెట్ కీపర్), శిఖర్ ధవన్, లోకేశ్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, కృనాల్ పాండ్యా, దీపక్ చాహర్, ఖలీల్ అహ్మద్, యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే.
బంగ్లాదేశ్:
మహ్మదుల్లా (కెప్టెన్), ముష్పికర్ రహీమ్ (వికెట్ కీపర్), లిటన్ దాస్, సౌమ్య సర్కార్, మహ్మద్ నయీమ్, అఫిఫ్ హొసైన్, అమీనుల్ ఇస్లాం, మొసాడెక్ హొసైన్, ముస్తాఫిజుర్ రహ్మాన్, షఫియుల్ ఇస్లాం, అల్ అమిన్ హొసైన్.