Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్ తొలి ఇన్నింగ్స్ :196 ఆలౌట్


ఆస్ట్రేలియా జట్టు భారత జట్టుకు తనదైన స్టైల్లో షాకిచ్చింది. భారత-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత జట్టును తొలి ఇన్నింగ్స్ల్ లో 196 పరుగులకే కుప్పకూల్చి తానేమిటో రుచి చూపింది. 147 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని ఆస్ట్రేలియా సాధించింది. అంతకుముందు ఆట రెండో రోజు తొమ్మిది వికెట్ల నష్టానికి 337 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో తన ఇన్నింగ్స్ ను కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టు 343 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్ లో వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. మొత్తం మీద ఇప్పటికి 179 పరుగుల ఆధిక్యాన్ని ఆస్ట్రేలియా మూటగట్టుకుంది. ఆటపై పట్టుబిగించింది.

అనంతరం తన తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించిన భారత జట్టు 4 పరుగులకే ఓపెనర్ జాఫర్ వికెట్ ను కోల్పోయింది. మరికొద్ది సేపటికే ద్రావిడ్ వికెట్ ను కోల్పోయింది. అప్పటికి భారత స్కోరు 31 పరుగులే. అనంతరం 51 పరుగుల వద్ద లక్ష్మణ్ వికెట్ ను కోల్పోయింది. తన కెరీర్ లో 48వ అర్థసంచరీ చేసిన సచిన్ కూడా జట్టు స్కోరు 120 పరుగులు ఉండగా పెవిలియన్ ముఖం పట్టాడు. అనంతరం యువరాజ్ సింగ్, ధోనిలు వెంటవెంటనే అవుటయ్యారు. అనంతరం 43 పరుగులు చేసిన గంగూలీ కూడా సహచరుల దారి పట్టాడు అప్పటికి జట్టు స్కోరు ఏడు వికెట్ల నష్టానికి 166 పరుగులు. మరో 30 పరుగులు జోడించి మిగతా బ్యాట్స్ మెన్ కూడా అవుటయ్యారు.
Story first published: Thursday, December 27, 2007, 23:53 [IST]
Other articles published on Dec 27, 2007
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+