Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రూ. 2 కోట్లకు అమ్ముడైన విహారీ, పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే..

India all-rounder Hanuma Vihari first player to be sold today

జైపూర్: మరోసారి ప్రఖ్యాత భారత దేశీవాళీ లీగ్ ఐపీఎల్‌కు సమయమైంది. జైపూర్ వేదికగా జరుగుతోన్న ఈ వేలంలో తొలి క్రికెటర్‌గా తెలుగు కుర్రాడ్ని వేలానికి ఉంచింది నిర్వాహక సంఘం. కొత్తగా ఢిల్లీ డేర్‌డెవిల్స్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌గా పేరు మార్చుకున్న ఢిల్లీ జట్టు ప్రారంభ ధర రూ.50లక్షలుగా ఉన్న విహారీని రూ.2కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఈ టీమిండియా ప్లేయర్ కొన్ని సీజన్ల నుంచి ఐపీఎల్‌లో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయకపోవడంతో.. ఆడటం లేదు. గతంలో ఓసారి హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ ఐపీఎల్‌లోకి

ఐపీఎల్‌లో 2015లో సన్‌రైజర్స్‌ తరఫున నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 39 పరుగులే చేశాడు. ఆ తర్వాత ఐపీఎల్‌లో అతడిని ఏ ప్రాంఛైజీ కొనుగోలు చేయలేదు. ఇలాంటి పరిణామాలే తనను మెరుగైన ఆటగాడిగా రూపొందించాయని విహారి అన్నాడు. ఇదే ఏడాది ఇంగ్లాండ్ పర్యటన చేపట్టిన టీమిండియాలో చోటు దక్కించుకుని కోహ్లీ చేతుల మీదుగా టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు కెప్టెన్ విరాట్ కోహ్లీ చేతుల మీదగా హనుమ విహారి టెస్టు క్యాప్‌ని అందుకున్నాడు. తద్వారా భారత్‌కు టెస్టుల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న 292వ ఆటగాడిగా హనుమ విహారి రికార్డులకెక్కాడు.

విహారి పూర్తి పేరు గాదె హనుమ విహారి

తాజాగా, ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. టీమిండియాలో చోటు దక్కించుకున్న విహారి పూర్తి పేరు గాదె హనుమ విహారి. 1993 అక్టోబర్‌ 13న కాకినాడలో జన్మించాడు. తండ్రి సత్యనారాయణ సింగరేణిలో సూపరింటెండెంట్‌గా పని చేస్తుండడంతో పుట్టిన కొద్ది రోజులకే విహారి అక్కడికి వెళ్లిపోయాడు.

2012 అండర్‌-19 ప్రపంచ కప్‌ జట్టులో తొలిసారిగా

2012 అండర్‌-19 ప్రపంచ కప్‌ జట్టులో తొలిసారిగా

మూడో తరగతి వరకు గోదావరిఖని, మణుగూరులలోను, ఆ తరువాత హైదరాబాద్‌లోను చదువు కొనసాగించాడు. క్రికెట్‌లో అనతికాలంలోనే ఉన్నత స్థానానికి విహారి ఎదగగలిగాడు. 2012లో అండర్‌-19 ప్రపంచకప్‌లో చోటు దక్కలేదు. చివరి క్షణాల్లో మనన్‌ వోహ్రా గాయపడడంతో అతడి స్థానంలో విహారిని ఎంపికచేశారు. ఇలా ప్రపంచ కప్‌ జట్టులో తొలిసారిగా స్థానం పొందాడు. ఆ తరువాత రంజీ పోటీల్లో మరింతగా రాణించాడు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో రాణిస్తోన్న విహారీ

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో రాణిస్తోన్న విహారీ

ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ.. 59.45 అత్యధిక సగటుతో ప్రపంచ క్రికెట్‌లో రెండో స్థానానికి చేరుకున్నాడు. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో కొనసాగుతున్న విహారి రెండేళ్లుగా తూర్పుగోదావరి జిల్లా నుంచే ప్రాతినిథ్యం వహిస్తూ టీమిండియాలో స్థానం దక్కించుకున్నాడు. గత రెండేళ్లుగా భారత్-ఎ, ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో విహారి నిలకడగా రాణిస్తున్నాడు.

Story first published: Tuesday, December 18, 2018, 16:32 [IST]
Other articles published on Dec 18, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+