Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

60 పరుగులకే ఐదు వికెట్లు: భారత్ 495 అలవుట్

బెంగళూర్: ఆస్ట్రేలియాపై బెంగళూర్ చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ చివరి ఐదు వికెట్లు కేవలం 60 పరుగులకే కోల్పోయింది. డబుల్ సెంచరీ సాధించిన సచిన్ టెండూల్కర్ అవుటైన తర్వాత భారత బ్యాట్స్ మెన్ చకచకా అవుటవుతూ పెవిలియన్ దారి పట్టారు. భారత్ తొలి ఇన్నింగ్సులో 495 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్సుపై భారత్ 17 పరుగుల స్వల్ప ఆధిక్యత సాధించింది. సచిన్ టెండూల్కర్ 214 పరుగులు చేసి పీటర్ జార్జ్ బౌలింగులో అవుటయ్యాడు. అంతకు ముందు మురళీ విజయ్ సోమవారం 139 పరుగులతో అద్భుతమైన సెంచరీ సాధించి అవుటయ్యాడు. సురేష్ రైనా 32 పరుగులు చేయగా, ధోనీ, సెహ్వాగ్ లు చెరి 30 పరుగులు చేశారు.

ఆ తర్వాత హర్భజన్ నాలుగు పరుగులకు, జహీర్ ఖాన్ ఒక్క పరుగుకు పెవిలియన్ దారి పట్టారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జాన్సన్ మూడు వికెట్లు తీసుకోగా, పీటర్ జార్జ్, నాథన్ హారిట్జ్, రెండేసి వికెట్లు తీసుకున్నారు. వాట్సన్, మైఖెల్ క్లార్క్, హిల్ఫన్హాస్ ఒక్కటేసి వికెట్లు తీసుకున్నారు. సోమవారం 191 పరుగులు చేసి క్రీజులో ఉన్న సచిన్ టెండూల్కర్ మంగళవారం డబుల్ సెంచరీ సాధించాడు. ఆయనకు టెస్టుల్లో ఇది ఆరవ డబుల్ సెంచరీ. ఇప్పటి వరకు టెస్టుల్లో ఆయన 49 సెంచరీలు సాధించాడు. మరో సెంచరీ సాధిస్తే 50 సెంచరీలు అవుతాయి. న్యూజిలాండ్ తో జరిగే టెస్టు సిరీస్ లో సచిన్ కు ఆ సెంచరీ సాధించే అవకాశం దక్కవచ్చు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+