
హైదరాబాద్: టెస్ట్ సిరీస్, వన్డే సిరీస్ వరుస వరుస విజయాల అనంతరం టీమిండియా మరోసారి తన ఆధిక్యాన్ని ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉంది. వన్డే సిరీస్‌లోనే టీమిండియా శ్రీలంకను క్లీన్ స్వీప్ చేసేందుకు పూనుకుంది. కాగా, టీమిండియా మొదటి మ్యాచ్ ఓడిపోవడంతో ఆ ఆశను ఈ టీ20ల్లోనైనా తీర్చుకోవాలని చూస్తుంది. డిసెంబరు 20న కటక్‌లో బారబతి వేదికగా జరగనున్న టీ20 సమరానికి ఇరు జట్లు సిద్ధమయ్యాయి.
టెస్టు, వన్డేలను మినహాయించి చూసినా శ్రీలంక జట్టు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జరుగుతున్న టీ20ల్లోనూ అదే స్థాయిలో పరాజయాల పాలైంది. చివరి ఐదు టీ20ల్లోనూ చిత్తుగా ఓడిపోయింది. ఇప్పటివరకు భారత్‌తో శ్రీలంక పదకొండు టీ20ల్లో తలపడగా ఏడింటిలో శ్రీలంక ఓడిపోయింది.
భారత్‌కు అప్పుడు కలిసిరాలేదు
బారాబతి వేదికగా భారత జట్టు 2015లో దక్షిణాఫ్రికా జట్టుపై తలపడింది. ఈ మ్యాచ్ భారత్ 92పరుగులకే కుప్పకూలింది. ఇంత అత్యల్ప స్కోరును నమోదు చేసుకోవడం భారత్‌కు అప్పటికి రెండోసారి. దీంతో ఆగ్రహించిన భారత్ అభిమానులు స్టేడియంలోకి బాటిళ్లు విసిరారు. ఈ సందర్భంగా 50నిమిషాల పాటు కలిగిన అంతరాయం పోలీసులు రంగప్రవేశం చేసి అదుపుచేయడంతో ఆగింది.
భారత్ జట్టు పరిస్థితి:
దీంతో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లు ఇన్నింగ్స్‌ను ఆరంభించే అవకాశం ఉంది. ఇటీవల ముగిసిన వన్డే సిరిస్‌లో రెండు హాఫ్ సెంచరీలతో అద్భుత ప్రదర్శన చేసిన శ్రేయాస్ అయ్యర్‌ను మూడో స్ధానంలో దింపే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాతి స్ధానాల్లో మనీశ్ పాండే, కార్తీక్ వచ్చే అవకాశం ఉంది.
ఇక, భారత బౌలింగ్ విషయానికి వస్తే కొన్ని మార్పులు చోటు చేసుకోనున్నాయి. టీ20 సిరిస్‌లో చోటు దక్కించుకున్న హైదరాబాదీ మహ్మద్ షిరాజ్, ఐపీఎల్‌లో యార్కర్లతో మెప్పించిన బసిల్ థంపీ, జయదేవ్ ఉనద్కత్‌లలో ఎవరు బుమ్రాతో కలిసి కొత్త బంతిని పంచుకుంటారో తెలియాల్సి ఉంది.
సిరీస్‌కు థంపి, సుందర్, దీపక్ హుడాలకు కొత్తగా చోటు దక్కింది. పేసర్లలో భువనేశ్వర్‌కు విశ్రాంతి ఇవ్వడంతో బుమ్రాకు జతగా సిరాజ్, థంపీ, ఉనాద్కట్‌లలో ఒకరికి అవకాశం దక్కుతుంది. కేరళ పేసర్ బాసిల్ థంపి నిలకడగా యార్కర్లు వేసే నైపుణ్యాన్ని ఇప్పటికే ఐపీఎల్‌లో నిరూపించు కున్నాడు. స్పిన్ విభాగంలో కుల్దీప్, చాహల్ మరోమారు రాణించేందుకు ఎదురుచూస్తున్నారు.
ఈ ఏడాది టెస్టు, వన్డే ఫార్మాట్‌లో విజేతగా నిలిచినా టీ20ల్లో మాత్రం అంతటి ప్రతిభను ప్రదర్శించలేకపోయింది. 2017లో ఈ ఫార్మాట్‌లో ఐదు సిరీస్‌లు ఆడితే అందులో మూడింటినే గెలుచుకుంది. ఒకటి ఓడి మరోటి డ్రా చేసుకుంది. ప్రస్తుతం జరగనున్న మ్యాచ్‌లో ధోనీ, బుమ్రా, పాండ్యాలే అనుభవమున్న ఆటగాళ్లు
లంక పరిస్థితి:
లంక పరిస్థితి అసలే బాగాలేదు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఉంది. ఆ జట్టు పరిస్థితి. చెలరేగి బ్యాటింగ్ చేసే పేసర్ లలిత్ మలింగ కూడా ఈ జట్టుకు దూరం కావడం తీవ్రమైన లోటు.
ఇక లంక జట్టు బ్యాటింగ్ మరోసారి పెరీరా, మాథ్యూస్‌లపైనే ఆధారపడి ఉంది. పెరీరా, సమరవిక్రమ, డిక్‌వెలా నుంచి మెరుపులు ఆశిస్తోంది. ఎలాంటి అంచనా లేని బౌలర్లు ధర్మశాల వన్డేలో భారత్‌ను వణికిస్తూ 112 పరుగులకే కుప్పకూల్చారు. ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచ్‌ల్లో కలిపి 6 వికెట్లు మాత్రమే తీయగలిగారు. ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ధనంజయ జట్టులో ఉన్నాడు.
పిచ్ పరిస్థితి:
2015లో ఇదే స్టేడియంలో ఓ టీ20 మ్యాచ్ జరిగింది. ఈ స్టేడియంలో తక్కువ స్కోరు నమోదయ్యే అవకాశం ఉంది.
జట్ల అంచనా:
భారత్ :
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, దినేశ్ కార్తీక్, ధోని, హార్ధిక్ పాండ్యా, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, జయదేవ్
శ్రీలంక:
తిసారా పెరీరా(కెప్టెన్), నిరోషాన్ డిక్వెల్లా, ఉపుల్ తరంగ, కుశాల్ జనిత్ పెరీరా, ఏంజెలో మాథ్యూస్, అసేలా గుణరత్న, దాసున్ షనక, పతిరన, నువాన్ ప్రదీప్, విశ్వా ఫెర్నాడో, చమీరా, గుణతిలక, ధనంజయ
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.