ప్రపంచకప్‌లో భారత్ బలమైన జట్టు: సౌరవ్ గుంగూలీ

ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ప్రపంచకప్‌లో భారత్ బలమైన జట్టు.. కచ్చితంగా భారత్ కప్ గెలుస్తుందని భారత మాజీ కెప్టెన్, ఢిల్లీ క్యాపిటల్స్ సలహాదారు సౌరవ్ గుంగూలీ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం చెన్నైలో అడ్వాన్డ్స్ హెయిర్ స్టూడియో పదో వార్షికోత్సవంకు సంస్థ బ్రాండ్ అంబాసిడర్ సౌరవ్ గుంగూలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా గుంగూలీ మీడియా సమావేశంలో మాట్లాడాడు.
'గత కొంత కాలంగా భారత్ మంచి ప్రదర్శన చేస్తోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వంలో భారత జట్టులోని యువ క్రీడాకారులు అద్భుతంగా రాణిస్తున్నారు. సీనియర్లు, కుర్రాళ్లతో జట్టు సమతూకంగా ఉంది. కోహ్లీ మాత్రమే కాదు ఎంఎస్ ధోనీ, రోహిత్, ధావన్ సహా అందరూ ప్రతిభావంతమైన క్రీడాకారులే' అని గుంగూలీ తెలిపారు.
'తమ హయాంతో పోల్చుకుంటే.. ప్రస్తుతం క్రికెట్‌లో ఒత్తిళ్లు పెరిగాయి, గట్టి పోటీ నెలకొంది. భారత్ సహా అన్నిదేశాల జట్లు మెరుగైన ఆటను ప్రదర్శిస్తున్నాయి. ప్రపంచకప్‌లో ఆయా జట్లు భారత్‌కు గట్టి పోటీ ఇస్తాయి. అయితే భారత్ బలమైన జట్టు. కచ్చితంగా కప్ గెలుస్తుంది' అని ఆశాభావం వ్యక్తం చేసాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications