Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: భారత్‌పై బాల్ టాంపరింగ్ ఆరోపణలు..ఇషాన్, రుతురాజ్‌పై వేటు!

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత్-ఏ జట్టుకు ఊహించని సంఘటన ఎదురైంది. బంతిని మార్చడంపై వివరణ కోరిన భారత ఆటగాళ్లకు అంపైర్ల నుంచి అనూహ్యంగా బాల్ టాంపరింగ్ ఆరోపణలు ఎదురయ్యాయి. అంతేగాక అంపైర్‌తో ఇషాన్ కిషన్ వాగ్వాదం అక్కడి వాతావరణాన్ని వేడెక్కించింది. మీది చెత్త నిర్ణయం అంటూ ఇషాన్ అంపైర్‌పై ఘూట వ్యాఖ్యలు చేశాడు.

అసలేం జరిగిదంటే..ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న అనధికారిక తొలి టెస్టు ఆఖరి రోజు ఈ వివాదం చోటు చేసుకుంది. ఆట ప్రారంభానికి కొద్దిసేపటి ముందు బంతి గురించి భారత-ఏ ఆటగాళ్లు అంపైర్ షాన్ క్రెయిన్‌ను ప్రశ్నించారు. అయితే దానికి అంపైర్ బదులిస్తూ.. బాల్ టాంపరింగ్ చేశారని భారత ఆటగాళ్లను ఆరోపించారు.

India A Faces Ball-Tampering Allegations in Defeat to Australia A Ishan Kishan Warned for Dissent

''మీరు బంతిని స్క్రాచ్ చేశారు. కాబట్టి మేం బాల్‌ను మార్చాం. దీనిపై ఇక ఎలాంటి చర్చ లేదు. ఆట కొనసాగించండి' అంటూ అంపైర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీని గురించి భారత్-ఏ జట్టు ఆటగాళ్లు స్పందిస్తుండగా.. అంపైర్ కఠినంగా బదులిచ్చాడు. 'చర్చించడానికి లేదు. ఆట ఆడండి. చర్చ చేయడానికి ఇక్కడ ఏం లేదు. ఈ బంతితో ఆటను కొనసాగించండి' అని అన్నారు.

దీనిపై వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఘూటుగా స్పందించాడు. అంపైర్‌ను 'నిజంగా.. నువ్వో చెత్త నిర్ణయం తీసుకున్నావు' అని ఇషాన్ అన్నాడు. దాంతో ఇషాన్ ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకుంటామని అంపైర్ తెలిపారు. ''మీపై రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది సరైన ప్రవర్తన కాదు. మీ జట్టు చేసిన పనికి బంతిని మార్చాం'' అని అంపైర్ పేర్కొన్నారు. అయితే భారత-ఏ జట్టులో బాల్ టాంపరింగ్ ఎవరు చేశారనే విషయాన్ని అంపైర్ స్పష్టంగా చెప్పలేదు.

కాగా, క్రికెట్ ఆస్ట్రేలియా నిబంధనల ప్రకారం.. ఉద్దేశపూర్వకంగా బంతిని మార్చినట్లు రుజువైతే సంబంధిత ఆటగాడిపై నిషేధం పడుతుంది. అయితే బాల్ టాంపరింగ్ చేసిన ప్లేయర్‌ను గుర్తించని సందర్భంలో, దానికి కెప్టెన్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. అప్పుడు భారత్-ఏ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వివాదానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది.

Story first published: Sunday, November 3, 2024, 9:46 [IST]
Other articles published on Nov 3, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+