Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వార్నీ: వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా చెత్త బ్యాటింగ్: 90 పరుగులకే టాప్ ఆర్డర్ టాప్ లేచింది

India 90 for 5 in the first innings at the lunch during the Practice Match against Leicestersh

ముంబై: భారత్-లీసెస్టర్‌షైర్ కౌంటీ క్లబ్‌ మధ్య లీసెస్టర్ స్టేడియంలో ఆరంభమైన వార్మప్ మ్యాచ్‌.. టీమిండియా చెత్త బ్యాటింగ్‌కు అద్దం పట్టింది. చాలాకాలం తరువాత ఇంగ్లాండ్ గడ్డపై అంచనాలకు భిన్నంగా, నిరుత్సాహ పరిచేలా బ్యాటింగ్ కొనసాగుతోంది. స్టేడియానికి చేరుకున్న టీమిండియా అభిమానులు కుదురుకునే లోపే సగం వికెట్లు నేలకూలాయి. రోహిత్ శర్మ సహా టాప్ ఆర్డర్ బ్యాటర్లు పెవిలియన్‌కు వెళ్లిపోయారు.

 లంచ్ సమయానికే సగం వికెట్లు..

లంచ్ సమయానికే సగం వికెట్లు..

భోజనం విరామ సమయానికి భారత జట్టు అయిదు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ-9, తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్-6 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. రోమన్ వాకర్.. మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. రోహిత్ శర్మ, హనుమ విహారి, రవీంద్ర జడేజను పెవిలియన్ దారి పట్టించాడు. ప్రసిద్ధ్ కృష్ణ, విల్ డేవిస్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. శ్రేయాస్ అయ్యర్‌ను ప్రసిద్ధ్ కృష్ణ డకౌట్‌గా పెవిలియన్ దారి పట్టించడం విశేషం. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు శ్రేయాస్.

 ప్రసిద్ధ్ బౌలింగ్‌లో రిషభ్ పంత్‌కు క్యాచ్..

ప్రసిద్ధ్ బౌలింగ్‌లో రిషభ్ పంత్‌కు క్యాచ్..

తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది టీమిండియా. కేప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్‌ను ఆరంభించారు. తొలి వికెట్ నష్టానికి 35 పరుగులు జోడించారు. 9.2 ఓవర్‌లో శుభ్‌మన్ గిల్ వికెట్ పడింది. 28 బంతుల్లో నాలుగు ఫోర్లతో 21 పరుగులు చేశాడు. విల్ డేవిస్ బౌలింగ్‌లో రిషభ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి గిల్ అవుట్ అయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 35 పరుగులు. మరో 15 పరుగులు జోడించిన తరువాత రోహిత్ శర్మ కూడా పెవిలియన్ దారి పట్టాడు.

హనుమ విహారి విఫలం..

హనుమ విహారి విఫలం..

జట్టు స్కోర్ 50 పరుగుల వద్ద రోహిత్ అవుట్ అయ్యాడు. 47 బంతుల్లో మూడు ఫోర్లతో 25 పరుగులు చేశాడు హిట్ మ్యాన్. అతణ్ని రోమన్ వాకర్ బలి తీసుకున్నాడు. షాట్ ఆడబోయిన రోహిత్ టైమింగ్ మిస్ అయ్యాడు. ఆ బంతి కాస్త నేరుగా వెళ్లి సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ సకండే చేతుల్లో వాలింది. ఇక ఆ తరువాత వరుసగా వికెట్లు పడ్డాయి. జట్టు స్కోరు 54 పరుగుల వద్ద హనుమ విహారి అవుట్ అయ్యాడు. అతను చేసింది మూడు పరుగులే.

రవీంద్ర జడేజా ఫెయిల్యూర్స్ కంటిన్యూస్..

రవీంద్ర జడేజా ఫెయిల్యూర్స్ కంటిన్యూస్..

55 పరుగుల వద్ద మరో వికెట్ కూలింది. శ్రేయాస్ అయ్యర్ తన పరుగుల ఖాతాను తెరవకుండానే వెనుదిరిగాడు. 11 బంతులను ఎదుర్కొన్న అయ్యర్ బోణీ కొట్టలేదు. 81 పరుగుల వద్ద మరో వికెట్. ఈ సారి ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజ రూపంలో వికెట్ పడింది. రోమన్ వాకర్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 13 బంతుల్లో రెండు ఫోర్లతో 13 పరుగులు చేశాడతను. టాప్ గేర్‌లో దూసుకెళ్తాడనుకునేలోపే అవుట్ అయ్యాడు. ఇండియన్ ప్రీిమియర్ లీగ్ ఫెయిల్యూర్స్‌ను జడేజా ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ కొనసాగించాడు.

Story first published: Thursday, June 23, 2022, 17:52 [IST]
Other articles published on Jun 23, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+