Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్ ను ఆదుకున్న ధోనీ, లక్ష్మణ్: 228/6


Laxmanన్యూఢిల్లీ: పాకిస్తానుతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్సులో భారత్ ను మహేంద్ర సింగ్ ధోనీ, వివియస్ లక్ష్మణ్ ఆదుకున్నారు. 93 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన పరిస్థితిలో వీరిద్దరు నిలకడగా ఆడారు. వికెట్ కీపర్ ధోనీ 57 పరుగులు చేశాడు. కనేరియా బౌలింగులో అతను స్టంప్ అవుటయ్యాడు. టెస్టుల్లో ఇది అతనికి ఏడో అర్థ సెంచరీ. శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి లక్ష్మణ్ 57 పరుగులతో, కుంబ్లే 7 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఆట ముగిసే సమయానికి భారత్ ఆరు వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. ధోనీ, లక్ష్మణ్ జోడీ 115 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.

అయితే 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత కనేరియా బౌలింగ్‌లో ధోని స్టంప్ట్‌గా నిష్క్రమించాడు. తాజా వార్తల ప్రకారం భారత్ 6 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేయగా, లక్ష్మణ్ (50), కుంబ్లే (0)లు క్రీజ్‌పై ఉన్నారు. ప్రారంభంలోనే ఓపెనర్ దినేశ్ కార్తిక్ (9) కీపర్ క్యాచ్‌తో అవుటయినప్పటికీ, వాసిం జాఫర్ (32), ద్రావిడ్ (38)లు కొంతవరకు నెట్టుకువచ్చారు. అయితే షోయబ్ అక్తర్ బంతికి ఎల్బీడబ్ల్యూ రూపంలో జాఫర్ (32)అవుటైన వెంటనే పరిస్థితి మారిపోయింది. ఆ వెంటనే సచిన్ (2) రన్నవుటై వెనుదిరిగాడు. మరో కొద్ది సేపటికే గంగూలీ (8), రాహుల్ ద్రావిడ్‌ (38)లను సోహైల్ తన్వీర్ క్లీన్ బౌల్డ్ రూపంలో పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో 93 పరుగులకే భారత్ టాప్ ఆర్డర్ కుప్పకూలినట్లయింది. అక్తర్, తన్వీర్ రెండేసి వికెట్లు తీసుకున్నారు.

అంతకుముందు మిస్బా, సమిల భాగస్వామ్యానికి శుక్రవారం ఉదయం తెరపడటంతో ఎనిమిది వికెట్ల నష్టానికి 210 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన పాకిస్థాన్ మరో 21 పరుగులు జోడించి, ఆలవుటైంది. సమితో కలసి తొమ్మిదో వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును కొంతవరకు కోలుకునేలా చేసిన మిస్బా ఉల్ హక్ 82 పరుగుల వద్ద రనౌట్ రూపంలో నిష్క్రమించగా, కుంబ్లే విసిరిన బంతితో క్లీన్ బౌల్డ్‌గా డేనిష్ కనేరియా (0) పెవిలియన్ బాట పట్టడంతో పాక్ కథ ముగిసింది. కుంబ్లేకు నాలుగు వికెట్లు లభించాయి. జహీర్ 2 వికెట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
Story first published: Friday, November 23, 2007, 23:53 [IST]
Other articles published on Nov 23, 2007
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+