Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్ vs పాక్ మ్యాచ్.. టాస్‌లో టీమిండియాకు అన్యాయం? (వీడియో)

IND W vs PAK W: మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న కీలక మ్యాచ్‌లో టాస్ ప్రక్రియపై వివాదం రాజుకుంది. పాకిస్తాన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకోగా.. ఈ నిర్ణయం వెనుక అక్రమం జరిగిందని పలువురు క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్ వీడియోలో అసలు ఏం జరిగింది?
టాస్‌ సమయంలో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా, మ్యాచ్ రిఫరీ ఉన్నారు. హర్మన్‌ప్రీత్ కౌర్ నాణేన్ని గాల్లోకి ఎగరేసినప్పుడు పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా స్పష్టంగా 'టెయిల్స్' అని కాల్ ఇచ్చింది. నాణెం కింద పడిన తర్వాత దాని ఫలితం 'హెడ్స్' అని స్పష్టంగా వచ్చింది. అయితే మ్యాచ్ రిఫరీ ఫలితాన్ని 'హెడ్స్' అని ప్రకటించిన తర్వాత.. అకస్మాత్తుగా పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా వైపు సైగ చేస్తూ, టాస్ పాకిస్తాన్ గెలిచిందని ప్రకటించారు.

IND W vs PAK W Toss Controversy Erupts Fans Claim Injustice to Team India

అభిమానుల ఆగ్రహం, అనుమానాలు
సాధారణంగా టాస్ నియమం ప్రకారం.. కెప్టెన్ ఇచ్చిన కాల్‌కు భిన్నమైన ఫలితం వస్తే ఆ జట్టు టాస్ కోల్పోయినట్టు లెక్క. కానీ ఈ ఘటనలో ఫాతిమా సనా 'టెయిల్స్' అని కాల్ ఇవ్వగా.. 'హెడ్స్' వచ్చినప్పటికీ పాకిస్తాన్‌కు టాస్ లభించడం అనేక ప్రశ్నలకు తావిచ్చింది. మ్యాచ్ రిఫరీ ఫలితాన్ని ప్రకటించే సమయంలో తప్పుగా విని లేదా పొరపాటుగా పాకిస్తాన్‌కు అనుకూలంగా నిర్ణయం ఇచ్చి ఉండవచ్చు. పాక్ కెప్టెన్ ఫాతిమా సనా ఇచ్చిన కాల్ మైక్రోఫోన్‌లో స్పష్టంగా టెయిల్స్ అని వినిపించినప్పటికీ.. రిఫరీకి ఆమె ఇచ్చిన కాల్ ఏదైనా గందరగోళానికి గురిచేసి ఉండవచ్చు.

ఈ దృశ్యం చూసిన టీమిండియా అభిమానులు వెంటనే సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. "టీమ్ ఇండియాకు అన్యాయం జరిగింది", "టాస్ ప్రక్రియలో అక్రమం" అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. సరైన ఫలితం ఏమిటో నిర్ధారించడానికి ఐసీసీ ఈ వీడియోను సమీక్షించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. టాస్ వివాదం ఎలా ఉన్నా, పాకిస్తాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకోవడంతో భారత జట్టు బ్యాటింగ్‌కు దిగింది.

భారత్ ప్లేయింగ్ XI:
స్మృతి మంధాన, ప్రతికా రావల్, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), స్నేహ్ రాణా, రేణుకా సింగ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి.

పాకిస్తాన్ ప్లేయింగ్ XI:
మునీబా అలీ, సదాఫ్ షమాస్, సిద్రా అమిన్, రమీన్ షమీమ్, ఆలియా రియాజ్, సిద్రా నవాజ్ (వికెట్ కీపర్), ఫాతిమా సనా (కెప్టెన్), నటాలియా పర్వైజ్, డయానా బైగ్, నష్రా సంధు, సాదియా ఇక్బాల్.

Story first published: Sunday, October 5, 2025, 16:09 [IST]
Other articles published on Oct 5, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+