పాక్‌తో మ్యాచ్‌లో భారత్ బిగ్ ట్విస్ట్.. స్టార్ ప్లేయర్ ఔట్!
మహిళల టీ20 ప్రపంచకప్ 2026 మెగా సమరంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఉత్కంఠభరిత పోరుకు టాస్ పడింది. ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. దాయాది జట్టుపై మొదటి నుంచే ఆధిక్యం సాధించడంతో పాటు బోర్డుపై భారీ స్కోరు ఉంచాలనే వ్యూహంతో టీమిండియా బరిలోకి దిగుతోంది.
జట్టులో మార్పులివే: హర్మన్‌ప్రీత్ కౌర్
టాస్ గెలిచిన అనంతరం భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. "మేం మొదట బ్యాటింగ్ చేయబోతున్నాం. పిచ్ బ్యాటింగ్‌కు చాలా అనుకూలంగా కనిపిస్తోంది. అందుకే మొదట బ్యాటింగ్ చేసి బోర్డుపై ఒక మంచి గౌరవప్రదమైన స్కోరును ఉంచాలనుకుంటున్నాం. గత ప్రపంచకప్‌లో సాధించిన విజయం మాకు అపారమైన ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఆ నమ్మకాన్ని ఈ టోర్నీలోనూ కొనసాగించడమే మా లక్ష్యం" అని పేర్కొంది. ఈ మ్యాచ్ కోసం జట్టులో చేసిన మార్పుల గురించి చెప్తూ.. గత మ్యాచ్‌లో బాగా ఆడిన యాస్తికా భాటియా స్థానంలో ఈరోజు భారతి ఫుల్‌మాలి తుది జట్టులోకి వచ్చిందని వెల్లడించింది. అలాగే ఈ మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు మీడియం పేసర్లతో బరిలోకి దిగుతున్నట్లు హర్మన్‌ప్రీత్ కౌర్ స్పష్టం చేసింది.

పాక్ బౌలింగ్‌పై మాకు నమ్మకం ఉంది: ఫాతిమా సనా
మరోవైపు టాస్ ఓడిపోయిన పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా మాట్లాడుతూ.. ఒకవేళ తాము టాస్ గెలిచినా మొదట బ్యాటింగే ఎంచుకునేవాళ్లమని చెప్పింది. పిచ్ చూస్తుంటే పూర్తిగా బ్యాటింగ్ ట్రాక్‌లా అనిపిస్తోందని అభిప్రాయపడింది. అయితే జట్టుగా తాము బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ప్రస్తుతం చాలా బాగున్నామని.. ముఖ్యంగా తమ బౌలింగ్ లైనప్ చాలా అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో పటిష్టంగా ఉందని ధీమా వ్యక్తం చేసింది. బ్యాటింగ్ విభాగంలో మరికొంత మెరుగవ్వాల్సిన అవసరం ఉందని, భారత్‌తో ఈ మ్యాచ్ మంచి పోటీగా సాగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. ఈ మ్యాచ్ ద్వారా సైరా జబీన్ అనే యువ క్రీడాకారిణి అంతర్జాతీయ ప్రపంచకప్‌లోకి అరంగేట్రం చేస్తోందని ఫాతిమా వెల్లడించింది.
ఇరు జట్లు ఇవే:
భారత మహిళల జట్టు: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), భారతి ఫుల్‌మాలి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్.
పాకిస్థాన్ మహిళల జట్టు: గుల్ ఫిరోజా, మునీబా అలీ (వికెట్ కీపర్), అయేషా జాఫర్, సైరా జబీన్, అలియా రియాజ్, నటాలియా పర్వైజ్, ఫాతిమా సనా (కెప్టెన్), రామీన్ షమీమ్, నష్రా సంధు, తస్మియా రుబాబ్, సాదియా ఇక్బాల్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications