For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND w Vs IRE w: టీమిండియా శతకాల మోత.. వన్డే చరిత్రలోనే రికార్డ్ స్కోరు!

టీమిండియా - ఐర్లాండ్‌ మహిళా జట్ల మధ్య జరుగుతోన్న మూడో వన్డే పలు రికార్డులకు వేదికగా నిలిచింది. ముఖ్యంగా టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ కు దిగిన టీమిండియా తొలిసారి వన్డేల్లో 400కిపైగా స్కోర్ చేసింది .

కెప్టెన్ స్మృతి మంధాన ( 80 బంతుల్లో 135 - 12 ఫోర్లు, 7 సిక్స్‌లు), మరో ఓపెనర్ ప్రతీకా రావల్ ( 129 బంతుల్లో 154 - 20 ఫోర్లు, ఒక సిక్స్‌) సెంచరీలతో అద్భుతంగా చెలరేగారు. వన్‌డౌన్‌లో దిగిన రిచా ఘోష్‌ ( 10 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 59) దూకుడు ప్రదర్శన చేసింది. దీంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 435 పరుగులు చేసింది.

IND w Vs IRE w India smash record Score 435 against Ireland becomes fourth-highest total in women s ODI cricket history

సాధరణంగా ఇప్పటి వరకు జరిగిన క్రికెట్ లో భారత మహిళా జట్టుకు 370/5 అత్యధిక స్కోరుగా ఉంది. అది కూడా ఐర్లాండ్‌ జట్టుపైనే రీసెంట్ గానే జనవరి 12న చేసింది. ఆ రికార్డు నమోదై మూడు రోజులు కూడా కాలేదు.. అంతలోనే ఇప్పుడు మరోసారి ఆ రికార్డును బ్రేక్ చేసి 435/5 చేసింది. మొత్తం ప్రపంచ వన్డే క్రికెట్ లో ఇది నాలుగో అత్యధిక స్కోర్. ఇక 2018లో ఐర్లాండ్ జట్టుపైనే న్యూజిలాండ్ కూడా 491/4 చేసింది. ఇది వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక స్కోర్. ఈ స్కోర్ ను ఇంకా ఎవరూ బీట్ చేయలేదు.

ఆరో అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యంగా
మొదటి బంతి నుంచే దూకుడు ప్రదర్శించిన స్మృతి మంధాన కెరీర్‌లో పదో సెంచరీని కంప్లీట్ చేసింది. ఈ క్రమంలో భారత్‌ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీని బాదిన బ్యాటర్‌గా రికార్డుకెక్కింది. 70 బంతుల్లోనే ఈ మార్క్‌ టచ్ చేసింది. మంధానకు ఇది వరుసగా రెండో సెంచరీ. ఇక ఇదే మ్యాచ్ లో ప్రతీకా రావల్‌ కూడా శతకం బాది.. కెరీర్ లో తన తొలి సెంచరీని సాధించింది. 100 బంతుల్లో దీన్ని సాధించింది. ఆ తర్వాత మరో 27 బంతుల్లోనే ఇంకో హాఫ్ సెంచరీ కూడా చేసింది.

అయితే మొదటి వికెట్‌కు మంధాన - ప్రతీకా రావల్ కలిసి 233 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇది మహిళల వన్డే హిస్టరీలో ఆరో అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యంగా రికార్డుకెక్కింది.

వీరబాదుడే..
ఇక ఇన్నింగ్స్ లో రిచా ఘోష్‌ కూడా వీరబాదుడే. ప్రతీకా - రిచా జోడీ కలిసి కేవలం 12 ఓవర్లలోనే 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రిచా ఔట్ అయ్యాక.. తేజల్‌ హసబ్నిస్‌ (28)తో కలిసి ప్రతీకా మరో 50 పరుగుల పార్ట్నర్ షిప్ నెలకొల్పింది. దీంతో టీమిండియా స్కోరు బోర్డు 400+ పరుగులు దాటేసింది. మొత్తంగా 435 చేసింది. ఐర్లాండ్‌ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. ఐర్లాండ్‌ బౌలర్లలో ఓర్లా 2 వికెట్లు పడగొట్టగా .. కెల్లీ, ఫ్రేయా, డెంప్సీ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

Story first published: Wednesday, January 15, 2025, 15:51 [IST]
Other articles published on Jan 15, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+