Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ZIM: వైభవ్ సూర్యవంశీ ఊచకోత.. తృటిలో ప్రపంచ రికార్డు మిస్!

IND vs ZIM: జింబాబ్వేతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 192 పరుగులు చేసింది. జింబాబ్వే ముందు 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 49 బంతుల్లో 81 పరుగులు చేసిన తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. జింబాబ్వే బౌలర్ల ధాటికి ఇతర భారత ప్లేయర్లు ఇబ్బంది పడుతున్నా వైభవ్ తనదైన స్టైల్లో ఫోర్లు, సిక్సర్లు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.

వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్‌లో 49 బంతులు ఎదుర్కొని 8ఫోర్లు, 4 సిక్సర్లు, 165 స్ట్రైక్ రేట్‌తో 81 పరుగులు చేశాడు. సాధారణంగా 200కు పైగా స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేసే వైభవ్, పిచ్ పరిస్థితులను అర్థం చేసుకుని ఈ మ్యాచ్‌లో అద్భుతమైన సంయమనాన్ని ప్రదర్శించాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ సెంచరీ చేసి ఉంటే టీ20 అంతర్జాతీయ సెంచరీ సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించి ఉండేవాడు. వైభవ్ వయసు కేవలం 15 సంవత్సరాల 121 రోజులు మాత్రమే. అయితే వైభవ్ సూర్యవంశీ ఆ మార్కును అందుకోలేకపోయాడు.

IND vs ZIM 3rd T20 Vaibhav Sooryavanshi Scores 81 Misses Youngest Century World Record

అభిషేక్ శర్మ విఫలం
అభిషేక్ శర్మకు జింబాబ్వే పర్యటన నిరాశాజనకంగా ముగిసింది. సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో కూడా అభిషేక్ బ్యాటింగ్‌లో రాణించలేకపోయాడు. అభిషేక్ శర్మ బ్లెస్సింగ్ ముజరబాని బౌలింగ్‌లో తడివానషే మరుమణికి క్యాచ్ ఇచ్చి కేవలం 2 పరుగులకే ఔటయ్యాడు. ఆదివారం జరిగిన మూడో మ్యాచ్‌లో, ముజరబాని ఆఫ్-స్టంప్‌కు చాలా దూరంగా ఒక బంతిని వేశాడు. అభిషేక్ తన క్రీజ్ నుండి ముందుకు వచ్చి కవర్స్ మీదుగా భారీ షాట్ కొట్టడానికి ప్రయత్నించాడు, కానీ బంతి అతని బ్యాట్ అంచుకు తగిలి నేరుగా వికెట్ కీపర్ గ్లౌజులలోకి వెళ్ళింది. జింబాబ్వే పర్యటనలో మూడు మ్యాచుల్లోనూ ముజరబాని బౌలింగ్ లోనే ఔట్ కావడం గమనార్హం.

అనంతరం ఇషాన్ కిషన్(29), శ్రేయస్ అయ్యర్(27), తిలక్ వర్మ(11*), రింకూ సింగ్(25)లు భారీ స్కోర్లు చేయలేకపోయారు. రింకూ సింగ్ చివర్లలో 14 బంతుల్లో 25 పరుగులతో మెరుపులు మెరిపించడంతో టీమిండియా 192 పరుగులు చేయగలిగింది. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఇవాన్స్ 2 వికెట్లు పడగొట్టగా.. బ్లెస్సింగ్ ముజరబాని, సికందర్ రజా, వెస్లీ మాధవెరె తలో వికెట్ తీశారు.

Story first published: Sunday, July 26, 2026, 18:26 [IST]
Other articles published on Jul 26, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+