IND vs ZIM: టీమిండియా తుది జట్టులో కీలక మార్పులు.. బరిలోకి కొత్త కుర్రాళ్లు!
IND vs ZIM: జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ స్టేడియంలో జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వెల్లడించాడు. ఇప్పటికే రెండు మ్యాచ్ లు గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. ఈ మ్యాచ్ కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేసేందుకు సిద్ధమైంది.
భారత జట్టులో మార్పులు
గత మ్యాచ్ లో ఉపయోగించిన అదే పిచ్ పైనే ఈ మ్యాచ్ కూడా జరుగుతుండటంతో.. సమయం గడిచేకొద్దీ పిచ్ మరింత నెమ్మదించే అవకాశం ఉందని శ్రేయస్ అయ్యర్ అభిప్రాయపడ్డాడు. గత మ్యాచ్‌లో తమ జట్టు అద్భుతంగా ఆడి 220 పరుగుల భారీ స్కోరు సాధించిందని.. అదే ఆటను ఈ మ్యాచ్ లోనూ రిపీట్ చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించాడు. పిచ్ ఎలా ప్రవర్తిస్తుందనే దానితో సంబంధం లేకుండా పరిస్థితులకు త్వరగా అలవాటుపడి భారీ స్కోరు సాధించడమే తమ లక్ష్యమని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో రెండు మార్పులు చేసినట్లు శ్రేయస్ అయ్యర్ వెల్లడించాడు. ప్రిన్స్ యాదవ్ స్థానంలో అశోక్ శర్మ తుది జట్టులోకి రాగా.. శివమ్ దూబే స్థానంలో సూర్యాన్ష్ షెడ్గే చోటు దక్కించుకున్నాడు.

జింబాబ్వే కెప్టెన్ ఏమన్నాడంటే?
జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా మాట్లాడుతూ.. తాము కూడా టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ చేయడానికే మొగ్గు చూపే వాళ్లమని అన్నాడు. కెప్టెన్ నుంచి మరిన్ని పరుగులు రావాల్సిన అవసరం ఉందని.. ఈ మ్యాచ్ లో తాను, తన జట్టు మంచి ప్రదర్శన ఇస్తామని ఆశిస్తున్నట్లు వెల్లడించాడు. అలాగే జట్టులో ఓ మార్పు జరిగిందని.. రిచర్డ్ నగరావా గాయం కారణంగా దూరం కావడంతో అతని స్థానంలో వెల్లింగ్టన్ మసకద్జా తుది జట్టులోకి వచ్చినట్లు తెలిపాడు.
ఇరు జట్లు ఇవే..
భారత్ జట్టు: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, సూర్యాన్ష్ షెడ్గే, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, మయాంక్ యాదవ్, అశోక్ శర్మ.
జింబాబ్వే జట్టు: బ్రియాన్ బెన్నెట్, బెన్ కరన్, డియాన్ మైయర్స్, సికిందర్ రజా (కెప్టెన్), రియాన్ బర్ల్, వెస్లీ మాధేవెరే, తడివనాషే మరుమాని (వికెట్ కీపర్), బ్రాడ్ ఎవాన్స్, న్యూమన్ న్యామురి, వెల్లింగ్టన్ మసకద్జా, బ్లెస్సింగ్ ముజరబాని.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

