టాస్ గెలిచి..: దీపక్ చాహర్ స్థానంలో ఆ ఫాస్ట్ బౌలర్: కారణం చెప్పని కేఎల్ రాహుల్

హరారె: భారత క్రికెట్ జట్టు తన జైత్రయాత్రను సాగిస్తోంది. జింబాబ్వే గడ్డపై ఆ దేశ జట్టుతో రెండో వన్డే ఇంటర్నేషనల్‌లో తలపడుతోంది. మూడు మ్యాచ్‌ల ఈ వన్డే సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 1-0 తేడాతో ఆధిక్యతను సాధించింది టీమిండియా. రెండో మ్యాచ్ కోసం బరిలోకి దిగింది. కొద్దిసేపటి కిందటే టాస్ పడింది. టీమిండియా టాస్ గెలిచి.. ఫీల్డింగ్ ఎంచుకుంది. హరారె స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్ దీనికి వేదిక కానుంది. సోని స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఈ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.

తొలి మ్యాచ్ తరహాలోనే..
ఫీల్డింగ్ ఎంచుకోవడం ద్వారా బౌలింగ్ విభాగం సత్తా చాటాలని భావించినట్టయింది. తొలి వన్డేలో 189 పరుగులకే కట్టడి చేసింది జింబాబ్వే జట్టును భారత్. అదే తరహాలో ఇప్పుడు కూడా తక్కువ పరుగులకే ప్రత్యర్థిని కట్టడి చేసేలా గేమ్ ప్లాన్ వేసింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్ వశమౌతుంది. లేదంటే ఎల్లుండి జరిగే చివరిదైన మూడో వన్డే వరకు ఎదురు చూడాల్సి వస్తుంది. ఇప్పుడున్న టీమిండియా దూకుడును చూస్తోంటే- గెలుపు లాంఛనప్రాయమే.

అచ్చొచ్చిన ఫీల్డింగ్..
ఇదివరకు ఇంగ్లాండ్, ఆ తరువాత వెస్టిండీస్ తరువాత వరుసగా ఇది మరో సిరీస్. దీన్ని కూడా కైవసం చేసుకోగలిగితే- విదేశీ గడ్డపై హ్యాట్రిక్ కొట్టినట్టవుతుంది. తొలి వన్డేలో ఆడిన జట్టులో మార్పులు చేయకపోవచ్చు టీమిండియా. ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో తిరుగులేదనిపించుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టును 189 పరుగులకే కట్టడి చేశారు భారత బౌలర్లు. ఆ స్కోర్‌ను 30.5 ఓవర్లలోనే ఛేదించారు బ్యాటర్లు. అందుకే మరోసారి ఫీల్డింగ్ ఎంచుకున్నట్టు కనిపిస్తోంది.

ఒక్క మార్పుతో..
టీమిండియా ఒక్క మార్పుతో బరిలోకి దిగింది. ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ స్థానంలో శార్దుల్ ఠాకూర్‌ను తుదిజట్టులోకి తీసుకుంది. తుదిజట్టులో- శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, ఇషాక్ కిషన్, కేఎల్ రాహుల్ (కేప్టెన్), దీపక్ హుడా, సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, కుల్‌దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ ఉన్నారు. దీపక్ చాహర్ స్థానంలో శార్దుల్ ఠాకూర్‌ను తీసుకోవడానికి గల కారణాలను కేఎల్ రాహుల్ వెల్లడించలేదు.

రెండు మార్పులతో జింబాబ్వే..
జింబాబ్వే రెండు మార్పులు చేసింది. తడిమనషె మరుమని, రిచర్డ్ ఎన్‌గరవ స్థానంలో టకుడ్జ్వానషె కైటనో, టనక చివంగను తుదిజట్టులోకి తీసుకుంది. తుదిజట్టులో- టకుడ్జ్వానషె కైటనో, ఇన్నోసెంట్ కియా, సీన్ విలియమ్స్, వెస్లె మధెవెరె, సికందర్ రజా, రెజిస్ చకబ్వా (కేప్టెన్-వికెట్ కీపర్), ర్యాన్ బర్ల్, ల్యూక్ జొంగ్వే, బ్రాడ్ ఎవాన్స్, విక్టర్ న్యౌచి, టనక చివంగ ఆడుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications