

హైదరాబాద్: వెస్టిండీస్‌తో టీ20కి ముందు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేలవ ఫామ్‌తో ఉన్నాడని అందుకే టీ20 జట్టులో ధోనీని తప్పిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. దానికి పలు విధాలుగా వివరణ వచ్చినా మహీ అభిమానులు జీర్జించుకోలేకపోయారు. దీంతో కెప్టెన్ కోహ్లీనే దానిపై వివరణ ఇచ్చాడు. ధోనీ చాలా గొప్ప ఆటగాడని.. రిషబ్ పంత్‌కు అవకాశమిచ్చేందుకే అతను జట్టులోంచి తప్పుకున్నాడని చెప్పడంతో సర్దుకున్నారు.
వెస్టిండీస్‌తో తాజాగా జరుగుతున్న మూడు టీ20ల సిరీస్, ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లకి ధోనీని జట్టులోకి ఎంపిక చేయని భారత్ సెలక్టర్లు అతని స్థానంలో వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌ని తీసుకున్నారు. ఇలా పంత్‌కి అవకాశమిచ్చేందుకు ధోనీనే పక్కకి తప్పుకున్నట్లు వార్తలు రావడంతో.. అతడిపై సునీల్ గవాస్కర్ లాంటి దిగ్గజ క్రికెటర్లు ప్రశంసలు కురిపించారు.
కానీ, ధోనీని టీ20ల నుంచి తప్పించడంపై మళ్లీ చర్చ మొదటికే వచ్చింది. వెస్టిండీస్‌తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం రాత్రి ముగిసిన తొలి టీ20లో వికెట్ కీపర్‌గా దినేశ్ కార్తీక్ బాధ్యతలు నిర్వర్తించాడు. అసలు సమస్య అక్కడే మొదలైంది. రిషబ్ పంత్‌కి ఛాన్స్ ఇచ్చేందుకు ధోనీని తప్పించామని టీమిండియా మేనేజ్‌మెంట్.. చెప్పింది. ఇప్పుడు దినేశ్ కార్తీక్‌కి కీపింగ్ బాధ్యతలు అప్పగించడంలో అంతర్యమేమిటి..? అని ఘాటుగా ప్రశ్నిస్తున్నారు.
టీమిండియా సెలక్షన్ కమిటీ ఉద్దేశపూర్వకంగానే ధోనీపై వేటు వేసిందని చెప్పుకొస్తున్నారు. సెలక్టర్లు మాట తప్పారంటూ మళ్లీ సోషల్ మీడియా వేదికగా కొత్త చర్చకి తెరలేపారు. ఫామ్ లేమి కారణంగా ధోనీని తప్పించామని చెప్పకుండా పంత్‌ను ఎరగా వేసి తప్పించారని వాపోతున్నారు.