ధావన్.. పరిగెత్తకపోయినా అవసరానికి ఆడాడు!!(వీడియో)


హైదరాబాద్: భారత్-వెస్టిండీస్‌ల మధ్య జరిగిన మూడో టీ20 శిఖర్ ధావన్ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. టీమిండియా ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా దిగిన శిఖర్ ధావన్ 92 పరుగులు చేశాడు. ఈ టీ20సిరీస్‌లలో 138 పరుగులు చేసిన ధావన్‌కు ఈ ఒక్క మ్యాచ్‌లోనే 92 పరుగులు చేయడంతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుకు ఎంపికయ్యాడు. ధాటిగా బ్యాటింగ్ చేయడమే కాకుండా ఫీల్డింగ్‌లోనూ చక్కగా ఆకట్టుకున్నాడు ధావన్.

కృనాల్ పాండ్యా బౌలింగ్ వేస్తుండగా
మూడో టీ20 మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ధావన్ ఫీట్‌ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. దానిని చూసిన టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ(5) ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. సాధ్యమైనంత వరకూ చక్కగానే బాదింది. ఆరో ఓవర్‌లో కృనాల్ పాండ్యా బౌలింగ్ వేస్తుండగా షెయ్ హోప్ గట్టి షాట్‌కు యత్నించాడు.
ఫీల్డింగ్ చేస్తున్న ధావన్ గాల్లోంచి నేరుగా
అయితే దానిని అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న ధావన్ ఎగిరి అందుకున్నాడు. కానీ, గాల్లోంచి నేరుగా ఫోర్ రోప్‌కి లోపలి వైపు పడ్డాడు. సిక్సు వెళ్తుందనే నమ్మకంతో పరుగులు తీయడం కూడా మానేసి చూస్తూ నిలబడిపోయారు. సిక్సు బౌండరీగా భావించిన షెయ్ హోప్.. బంతిని ధావన్ ఆపేయడంతో ఒకింత నిరుత్సాహానికి గురైయ్యాడు. ధావన్ ఆపేసిన తర్వాత అప్రమత్తం కావడంతో వెస్టిండీస్‌కు ఆ బంతికి కేవలం ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. ఇలా ధావన్ భారత్‌కు ఐదు పరుగుల భారాన్ని తగ్గించాడు.

మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ధావన్
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ను భారత్ ఊడ్చేసింది. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన మూడో మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విండీస్‌ను ఓడించిన టీమ్‌ఇండియా సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ 3 వికెట్లకు 181 పరుగులు చేయగా.. ఛేదనలో భారత్ 4 వికెట్లు కోల్పోయి ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. ధావన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, కుల్‌దీప్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కాయి.

ధావన్, పంత్ 36,30 బంతుల్లో హాఫ్ సెంచరీ
ధావన్ బౌండరీల మోత మోగించాడు. ఆఫ్‌సైడ్ చక్కని షాట్లతో అలరించాడు. అతనికి పంత్ జత కలవడంతో భారత్ స్కోరు పరుగులెత్తింది. ఇదే క్రమంలో ధావన్ 36 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేయగా.. పంత్ 30 బంతుల్లో టీ20ల్లో తన తొలి అర్ధసెంచరీ సాధించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications