Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీ20 సిరీస్‌లోనూ ఫేవరేట్‌గానే బరిలోకి టీమిండియా: వెస్టిండీస్ కోచ్

IND vs WI: India start the T20I series as favourites, says Windies skipper Carlos Brathwaite

హైదరాబాద్: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం రాత్రి 7గంటలకి జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ జట్టే ఫేవరెట్ అని వెస్టిండీస్ కెప్టెన్ కార్లోస్ బ్రాత్‌వైట్ వెల్లడించాడు. ఇటీవల ముగిసిన టెస్టు, వన్డే సిరీస్‌లకి దూరంగా ఉన్న బ్రాత్‌వైట్.. టీ20ల్లో ఆడేందుకు భారత్‌కి వచ్చిన విషయం తెలిసిందే. అతనితో పాటు డారెన్ బ్రావో, దినేశ్ రామ్‌దిన్, కీరన్ పొలార్డ్‌ తదితర హిట్టర్లు కూడా టీ20 జట్టులోకి వచ్చారు.

హిట్టర్లతో నిండిన వెస్టిండీస్ జట్టు

హిట్టర్లతో నిండిన వెస్టిండీస్ జట్టు

దీంతో.. వెస్టిండీస్ జట్టు హిట్టర్లతో నిండిపోగా.. మరోవైపు భారత్ మాత్రం కోహ్లి, ధోనీ జట్టులో లేకపోవడంతో బలహీనంగా కనిపిస్తోంది. కానీ.. మూడు టీ20ల ఈ సిరీస్‌లో భారత్ జట్టే ఫేవరెట్‌ అని బ్రాత్‌వైట్ చెప్పుకొచ్చాడు.

టీ20 సిరీస్‌లో కచ్చితంగా భారతే ఫేవరెట్.

టీ20 సిరీస్‌లో కచ్చితంగా భారతే ఫేవరెట్.

‘భారత్ జట్టు సొంతగడ్డపై ఆడుతోంది. దీంతో.. ఏ ఫార్మాట్‌లోనైనా ఆ జట్టుకి తిరుగుండదు. ముఖ్యంగా.. ఐపీఎల్ అనుభవంతో ఆ జట్టు టీ20ల్లో అద్భుతంగా ఆడే అవకాశం ఉంది. కాబట్టి.. వారు ఈ టీ20 సిరీస్‌లో కచ్చితంగా ఫేవరెట్. మరోవైపు మా జట్టులో సగం మంది యువకులు ఉన్నారు. వారు కూడా కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) ద్వారా వెలుగులోకి వచ్చినవారే.

ఆశించిన దానికంటే యువ క్రికెటర్లు

ఆశించిన దానికంటే యువ క్రికెటర్లు

భారత్‌పై ఇటీవల ముగిసిన వన్డేల్లో నేను ఆశించిన దానికంటే యువ క్రికెటర్లు మెరుగైన ప్రదర్శనే కనబర్చారు. టీ20ల్లోనూ అదే ప్రదర్శనతో ఆశ్చర్యపరుస్తారేమో..? చూడాలి' అని కార్లోస్ బ్రాత్‌వైట్ వెల్లడించాడు.

2 రోజుల క్రితం కెప్టెన్‌ బ్రాత్‌వైట్‌తో సహా ఏడుగురు

2 రోజుల క్రితం కెప్టెన్‌ బ్రాత్‌వైట్‌తో సహా ఏడుగురు

టీ20ల కోసం రెండు రోజుల క్రితం కెప్టెన్‌ బ్రాత్‌వైట్‌తో సహా ఏడుగురు వెస్టిండీస్ క్రికెటర్లు భారత్‌కి వచ్చారు. అయితే వారితో కలిసి విమానంలో రాని రస్సెల్‌ దుబాయ్ మీదుగా.. ఆదివారం భారత్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన వెస్టిండీస్ ప్రాక్టీస్ సెషన్‌లో అతను పాల్గొనలేకపోయాడు. ఓపెనర్లు క్రిస్‌గేల్, ఎవిన్ లావిస్ వ్యక్తిగత కారణాలతో ఈ పర్యటనకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే.

Story first published: Sunday, November 4, 2018, 15:16 [IST]
Other articles published on Nov 4, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+