వాళ్లది బలమైన బ్యాటింగ్ లైనప్: భారీ స్కోర్ చేసినా.. ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందే

వాషింగ్టన్: వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. స్వదేశంలో ప్రత్యర్థి జట్టు తుక్కు రేగ్గొడుతోంది. అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇవ్వాళ చివరిదైన అయిదో మ్యాచ్‌లో తలపడాల్సి ఉంది. నాలుగో మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇచ్చిన ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌లో గల సెంట్రల్ బ్రొవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియంలోనే ఇవ్వాళ్టి మ్యాచ్ కూడా షెడ్యూల్ అయింది.

భారీ స్కోర్‌తో..
భారత కాలమానం ప్రకారం.. రాత్రి 8 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. సోనీ లివ్ దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ మ్యాచ్‌లో కూడా ఘన విజయాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది టీమిండియా. నాలుగో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన వెస్టిండీస్.. ఆరంభం నుంచే తడబడింది. వరుసగా వికెట్లను కోల్పోయింది. 132 పరుగులకు ఆలౌట్

ప్లానింగ్.. ఎగ్జిక్యూషన్..
ఈ వరుస విజయాలపై రోహిత్ శర్మ స్పందించాడు. ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ.. నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా ఆడితే మాత్రం ముప్పు తప్పదని పేర్కొన్నాడు. వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్‌ను ప్రశంసించాడు. వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్ ముందు భారీ స్కోర్ చేసినా ఓటమి తప్పకపోవచ్చని వ్యాఖ్యానించాడు. ముందుగా రూపొందించుకున్న ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేస్తేనే విజయం సాధ్యపడుతుందని పేర్కొన్నాడు. ముందుగా రూపొందించుకున్న ప్లానింగ్‌ను ఎగ్జిక్యూషన్ చేయడంపైనే గెలుపోటములు ఆధారపడి ఉంటాయని అన్నాడు.

పూరన్ వికెట్..
నికొలస్ పూరన్ వికెట్ అత్యంత విలువైనదిగా అభివర్ణించాడు రోహిత్ శర్మ. అయిదో ఓవర్‌లో 22 పరుగులను అతను రాబట్టుకున్నాడని గుర్తు చేశాడు. తొలి అయిదు బంతుల్లో 4,6,0,6,6 పరుగులు చేసిన పూరన్.. చివరి బంతికి రనౌట్ అయిన విషయం తెలిసిందే. ప్లానింగ్ ప్రకారం ఆడటం అనేది అన్ని సందర్భాల్లోనూ సాధ్యపడకపోవచ్చని పేర్కొన్నాడు. అలాంటి సందర్భాల్లో ప్రత్యర్థి వెస్టిండీస్ అయి ఉంటుందనీ వ్యాఖ్యానించాడు.

ఇదే దూకుడు..
లాడర్‌హిల్ పిచ్ బాగా స్లో అని, దీనిపై 191 పరుగులు చేయడం మంచి స్కోరేనని పేర్కొన్నాడు. స్లో పిచ్‌పై భారీ స్కోర్ చేయడం అంత సులభం కాదని పేర్కొన్నాడు. వెస్టిండీస్ జట్టును కట్టడి చేసే విషయంలో బౌలర్లు ప్రణాళికబద్ధంగా రాణించారని ప్రశంసించాడు. జట్టులో ప్రతి ప్లేయర్ కూడా పూర్తి సామర్థ్యంతో ఆడుతున్నాడని, జట్టు మొత్తం ఫామ్‌లో ఉందని, మున్ముందు ఇదే దూకుడు కొనసాగుతుందని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications