కేరీర్ విషయంలో ఓపెన్ అయిన దినేష్ కార్తీక్: ఆ ఇద్దరి వల్లే బ్యాక్ టు టీమ్: బ్యాటింగ్ సీక్రెట్ అదే

ఫ్లోరిడా: టీమిండియా వికెట్ కీపర్ దినేష్ కార్తీక్. చాలాకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. ఫామ్ కోల్పోవడం వల్ల భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ సెలెక్టర్ల దృష్టిలో పడే అవకాశాలు లేవనుకుంటున్న దశలో రాకెట్‌లా దూసుకొచ్చాడు. జట్టులో మిస్టర్ డిపెండబుల్‌గా ఎదిగాడు.. ది బెస్ట్ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్‌లో తానేమిటో నిరూపించుకున్నాడు. తాను ఆడుతోన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును కొన్ని మ్యాచ్‌లల్లో ఒంటిచేత్తో గెలిపించాడు.
దీనితో మళ్లీ టీమిండియాకు సెలెక్ట్ అయ్యాడు. 37 సంవత్సరాల వయస్సులో టీమిండియాలో చోటు దక్కించుకోవడం అంటే మాటలు కాదు. ఐపీఎల్ తరువాత టీ20 సిరీస్ అంతర్జాతీయ సిరీస్‌లల్లో ఆడాడు. తన కేరీర్ విషయంలో తొలిసారిగా స్పందించాడీ వికెట్ కీపర్ బ్యాటర్. ఫ్లోరిడా స్టేడియంలో చిట్‌చాట్ చేశాడు. తాను మళ్లీ జట్టులోకి రావడానికి ప్రధాన కారణం కేప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడేనంటూ స్పష్టం చేశాడు.
వారిద్దరి కోఆపరేషన్ వల్లే తాను టీమ్‌లో కొనసాగగలుగుతున్నానని స్పష్టం చేశాడు. తనప వారిద్దరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వాటిని వమ్ము చేయకుండా ఆడటానికే ప్రాధాన్యత ఇస్తానని చెపపాడు. మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేయడం ద్వారా వారిద్దరికీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని పేర్కొన్నాడు. జాతీయజట్టులో సెలెక్ట్ అయిన తరువాత తన వ్యక్తిగత జీవితంలోనూ సంతోషకర క్షణాలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నాడు.
ఇలాంటివి ఇంకా ముందే రావాల్సి ఉండేదని వ్యాఖ్యానించాడు. బ్యాటింగ్‌లో బౌలర్ ఎవరనేది పెద్దగా పట్టించుకోనని, అతను ఎలాంటి బంతులను సంధిస్తాడనే విషయం మీదే దృష్టి పెడతానని పేర్కొన్నాడు. పవర్ హిట్టింగ్ మీదే ఎక్కువగా కాన్సన్‌ట్రేషన్ చేస్తానని చెప్పుకొచ్చాడు. పవర్ హిట్టింగ్‌తోనే తన బ్యాటింగ్ గాడిన పడినట్లు భావిస్తున్నానని అన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో ఆడాలనేది తన కల అని, దాన్ని సాకారం చేసుకునే అవకాశం వచ్చిందని వ్యాఖ్యానించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications