For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇదే పిచ్‌పై కేఎల్ రాహుల్ సెంచరీ: ఇప్పుడు అందుబాటులో లేడు మరి

IND vs WI 4th T20I: KL Rahul has the highest individual score in T20I in Floridas Lauderhill

వాషింగ్టన్: వెస్టిండీస్‌ పర్యటనలో ఉన్న టీమిండియా ఆ దేశ జట్టుతో ఇవ్వాళ నాలుగో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడబోతోంది. అయిదు మ్యాచ్‌ల ఈ సిరీస్ అమెరికాకు షిఫ్ట్ అయింది. ఫ్లోరిడాలోని లాండర్‌హిల్‌లో గల సెంట్రల్ బ్రొవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియంలో అమెరికా కాలమానం ప్రకారం.. ఉదయం 10:30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఇప్పటికే రెండు జట్ల ప్లేయర్లు మియామికి చేరుకున్నారు. జోరుగా నెట్ ప్రాక్టీస్‌ చేశారు.

 కీలక మ్యాచ్..

కీలక మ్యాచ్..

భారత్-వెస్టిండీస్ మధ్య జరిగే ఈ నాలుగో టీ20.. రెండు జట్లకూ కీలకమైన మ్యాచ్. ఇప్పటికే 2-1 తేడాతో భారత్ ఆధిక్యతలో ఉంది. టీమిండియా దీన్ని గెలిస్తే.. ఇంకో మ్యాచ్ మిగిలివుండగానే సిరీస్‌ను చేజిక్కించుకున్నట్టవుతుంది. ఇందులో విజయం సాధించిన ఆధిక్యతను సమం చేయాలనే పట్టుదలతో ఉంది వెస్టిండీస్ జట్టు. పరాజయాలకు బ్రేక్ వేయాలని భావిస్తోంది. దీనికి అనుగుణంగా వ్యూహాలను రూపొందించుకుంది.

 టీ20కి అనుకూలించే పిచ్..

టీ20కి అనుకూలించే పిచ్..

లాండర్‌హిల్ పిచ్.. టీ20 ఫార్మట్‌కు అనుకూలించేది. అమెరికాలో క్రికెట్‌కు పెద్దగా ఆదరణ లేదనే విషయం తెలిసిందే. ఈ స్టేడియంలో జరిగిన క్రికెట్ మ్యాచ్‌ల సంఖ్య కూడా చాలా తక్కువే. క్రికెట్‌కు అనుకూలంగా లాండర్‌హిల్ స్టేడియాన్ని తీర్చిదిద్దినప్పటి నుంచీ ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. ఇది 14వది. ఇదే స్టేడియంలో భారత్-వెస్టిండీస్ తలపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. 2016 నుంచి 2019 మధ్యకాలంలో ఈ రెండు జట్లు రెండు మ్యాచ్‌లను ఆడాయి.

కేఎల్ రాహుల్..

కేఎల్ రాహుల్..

ఈ పిచ్‌పై అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన మొనగాడిగా పేరు లిఖించుకున్నాడు కేఎల్ రాహుల్. 2016లో ఇదే లాండర్‌హిల్ స్టేడియంలో వెస్టిండీస్‌పై జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సెంచరీ సాధించాడు. 51 బంతుల్లో 110 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో డజను బౌండరీలు ఉన్నాయి. అయిదు భారీ సిక్సర్లతో సెంచరీని అందుకున్నాడు. అయినప్పటికీ- ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది. ఒక్క పరుగు తేడాతో పరాజయాన్ని చవి చూసింది.

సునీల్ నరైన్..

సునీల్ నరైన్..

లాండర్ హిల్ సెంట్రల్ బ్రొవార్డ్ పార్క్ స్టేడియంలో అత్యధిక వికెట్లు తీసుకున్న వీరుడిగా వెస్టిండీస్ టీ20 స్పెషలిస్ట్ స్పిన్ బౌలర్ సునీల్ నరైన్ రికార్డు నెలకొల్పాడు. 2012లో న్యూజిలాండ్‌పై 12 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా అయిదు ఇన్నింగుల్లో తొమ్మిది వికెట్లు తీసుకున్నాడు. ఇప్పటికీ అది చెక్కు చెదరలేదు. ఇవ్వాళ్టి మ్యాచ్‌లో అటు బ్యాటింగ్‌లో వ్యక్తిగత స్కోర్, ఇటు బౌలింగ్‌లో బెస్ట్ ఫిగర్స్ నమోదవుతాయేమో చూడాలి మరి.

Story first published: Saturday, August 6, 2022, 12:38 [IST]
Other articles published on Aug 6, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+