వీడియో: చెత్త షాట్: రిషభ్ పంత్ అవుట్‌పై రోహిత్ శర్మ: ఎన్ని బూతులు తిట్టుకున్నాడో..

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. వెస్టిండీస్ పర్యటన మొదలు పెట్టిన అనంతరం టీమిండియా అందుకున్న నాలుగో గెలుపు ఇది. ఇదివరకు మూడు మ్యాచ్‌ల వన్డే ఇంటర్నేషనల్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు టీ20 సిరీస్‌లోనూ తన తడాఖా చూపుతోంది. అయిదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది.

కరేబియన్లపై దండయాత్ర..
ట్రినిడాడ్ అండ్ టుబాగో తరౌబాలో గల బ్రియాన్ లారా స్టేడియంలో జరిగిన తొలి టీ20లో ఏకంగా 68 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను మట్టి కరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 64 పరుగులతో కేప్టన్ కమ్ ఓపెనర్ రోహిత్ శర్మ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దినేష్ కార్తీక్ 19 బంతుల్లో 41 పరుగులతో మెరుపులు మెరిపించాడు. లక్ష్యఛేదనలో కరేబియన్ వీరులు తడబడ్డారు. 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 122 పరుగులే చేయగలిగారు.

పంత్ షాట్ సెలెక్షన్‌పై..
ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ రిషభ్ పంత్ అవుట్ అయిన తీరు అతని నిర్లక్ష్యానికి అద్దం పట్టింది. పంత్ అవుట్ అయిన తరువాత వరుసగా వికెట్లు పడ్డాయి. ఆరు ఓవర్లల్లో నాలుగు వికెట్లు నేల కూలాయి. చివర్లో దినేష్ కార్తీక్ ఆదుకున్నాడు కాబట్టి సరిపోయింది. 19 బంతుల్లో 41 పరుగులు బాది అవతల పడేశాడు దినేష్ కార్తీక్. పక్కా ఐపీఎల్ తరహాలో ఆడాడు. జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అతను ఈ ఇన్నింగ్ ఆడకపోయి ఉంటే టార్గెట్ అంత వరకు వెళ్లుండేది కాదు.
భారీ షాట్ ఆడబోయి..
ఇన్నింగ్ 10వ ఓవర్‌లో రిషభ్ పంత్ అవుట్ అయ్యాడు. కీమో పాల్ వేసిన ఓవర్ అది. హాఫ్ సైడ్ దిశగా కాస్త వికెట్లకు దూరంగా బంతిని సంధించాడు. ఈ స్లోయర్‌ను భారీ ఆన్ సైడ్ దిశగా భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు రిషభ్ పంత్. టైమింగ్ మిస్ అయ్యాడు. ఎడ్జ్ తీసుకున్న ఆ బంతి షార్ట్ థర్డ్ మ్యాన్ దిశగా గాల్లోకి లేచింది. అక్కడే కాపు కాసిన మెక్‌కాయ్ దాన్ని అందుకున్నాడు. లెఫ్ట్ సైడ్ డైవ్ చేసి మరీ అద్భుతంగా క్యాచ్ పట్టాడు. దీనితో 12 బంతుల్లో 14 పరుగులు చేసి వెనుదిరగాల్సి వచ్చింది.

రోహిత్ శర్మ అసహనం..
అప్పటికి జట్టు స్కోర్ 9.6 ఓవర్లల్లో 88 పరుగులు. మూడు వికెట్‌గా రిషభ్ పంత్ వెనుదిరిగాడు. ఈ షాట్ రోహిత్ శర్మకు చిరాకు తెప్పించింది. నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న రోహిత్ శర్మ ఈ తతంగం మొత్తాన్నీ చూస్తూ తీవ్ర నిరాశకు గురయ్యాడు. తన అసహనాన్ని దాచుకోలేకపోయాడు. షాట్ ఎలా ఆడాలనుకున్నావ్.. ఎలా ఆడావ్ అని అర్థం వచ్చేలా చేతులు ఊపడం కనిపించింది. అతని షాట్ సెలెక్షన్‌పై తన అసంతృప్తి బయటపెట్టుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications