Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఉప్పల్‌ స్టేడియంలో తొలి టీ20: టీమిండియా విజయ లక్ష్యం 208

India (IND) vs West Indies (WI) Live Score, 1st T20I: Hetmyer, Pollard power West Indies to 207 for 5 vs sloppy India

హైదరాబాద్: నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న తొలి టీ20లో వెస్టిండిస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. దీంతో టీమిండియాకు 208 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండిస్ జట్టు ఆరంభం నుంచే దూకుడుగా ఆడటం ప్రారంభించింది. ఈ క్రమంలో 13 పరుగుల వద్ద ఓపెనర్ సిమన్స్ (2) వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత మరో ఓపెనర్ ఎవిన్ లూయిస్ 17 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 40 పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన బ్రాండన్ కింగ్ 23 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 31 పరుగులతో చెలరేగాడు. అయితే, విండిస్ విధ్వంసకర ఆటగాళ్లలో ఒకడైన హెట్‌మెయిర్(41 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 56) హాఫ్ సెంచరీ సాధించాడు. టీ20ల్లో హెట్‌మెయిర్‌కు ఇదే తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం.

చివర్లో కెప్టెన్ కీరన్ పొలార్డ్ 19 బంతుల్లో 1 ఫోర్, నాలుగు సిక్సర్లతో 37 పరుగుల వరద పారించాడు. దూకుడుగా ఆడే క్రమంలో పొలార్డ్ జట్టు స్కోరు 173 పరుగుల వద్ద చాహల్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. చివర్లో జాసన్ హోల్డర్(9 బంతుల్లో 24) పరుగులతో మెరవడంతో విండిస్ స్కోరు 200 దాటింది.

వెస్టిండిస్ ఇన్నింగ్స్‌లో మొత్తం 15 సిక్సర్లు నమోదయ్యాయి. భారత బౌలర్లలో యజువేంద్ర చాహాల్‌ రెండు వికెట్లు తీయగా... వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, రవీంద్ర జడేజాలకు తలో వికెట్ లభించింది.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా
అంతకముందు టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మంచు ప్రభావం నేపథ్యంలో ఛేదన సులభమవుతుందని కోహ్లీ చెప్పాడు. పేసర్లు మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ తుది జట్టులోకి వచ్చినట్లు కోహ్లీ తెలిపాడు. మూడు టీ20ల సిరీస్‌లో భారత్‌ ఫేవరెట్‌గా కనిపిస్తోంది.


ఈ ఏడాది ఆగస్టులో సొంతగడ్డపై వైట్‌వాష్‌ అయిన వెస్టిండిస్ జట్టు టీమిండియాపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు పెద్దఎత్తున అభిమానులు స్టేడియానికి చేరుకున్నారు. ఉప్పల్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించనుండటంతో పరుగుల వరద ఖాయమని తెలుస్తోంది.

జట్ల వివరాలు:
భారత జట్టు: రోహిత్ శర్మ, లోకేశ్ రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, యుజువేంద్ర చాహల్

వెస్టిండీస్ జట్టు: లెండిల్ సిమన్స్, ఎవిన్ లూయిస్, బ్రాండన్ కింగ్, హెట్‌మైర్, కీరన్ పొలార్డ్(కెప్టెన్), దినేశ్ రాందిన్(వికెట్ కీపర్), జాసన్ హోల్డర్, హేడెన్ వాల్ష్, షెల్డన్ కాట్రెల్, కేస్రిక్ విలియమ్స్, ఖ్యారీ పిర్రే

Story first published: Friday, December 6, 2019, 21:00 [IST]
Other articles published on Dec 6, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+