8 వేల పరుగుల క్లబ్‌లోకి కోహ్లీ
శ్రీలంకతో తొలి టెస్ట్ మ్యాచ్‌లో 38 పరుగుల వద్ద వ్యక్తిగత స్కోర్ వద్ద టీమిండియా వెటరన్ బ్యాటర్ ఈ ఫార్మాట్‌లో 8 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. దీంతో టెస్ట్ క్రికెట్‌లో 8 వేల పరుగులు చేసిన ఆరో భారత ఆటగాడిగా, ప్రపంచంలో 33వ ఆటగాడిగా నిలిచాడు. విరాట్ కోహ్లీ కంటే ముందు సచిన్ టెండూల్కర్ (15921), రాహుల్ ద్రావిడ్ (13288), సునీల్ గవాస్కర్ (10122), వీవీఎస్ లక్ష్మణ్ (8781), వీరేంద్ర సెహ్వాగ్ (8586) ఉన్నారు. కాగా తన వందో టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ ఈ రికార్డును చేరుకోవడం విశేషం.
900 ఫోర్లు
టెస్ట్ ఫార్మాట్‌లో విరాట్ కోహ్లీ 900 ఫోర్లు పూర్తి చేసుకున్నాడు. తొలి టెస్ట్ మ్యాచ్‌లో 5 ఫోర్లు కొట్టిన కోహ్లీ ఈ రికార్డును అందుకున్నాడు. టెస్ట్ కెరీర్లో ఇప్పటివరకు విరాట్ కోహ్లీ 901 ఫోర్లు, 24 సిక్సులు బాదాడు. టెస్టుల్లో కోహ్లీ స్ట్రైక్‌రేట్ 55గా ఉంది. కోహ్లీ ఇప్పటివరకు వన్డేల్లో 1153, టీ20ల్లో 298 ఫోర్లు బాదాడు. ఇక వన్డేల్లో 126 సిక్సులు, టీ20ల్లో 92 సిక్సులు బాదాడు.

నిరాశపరిచిన కోహ్లీ
వందో టెస్ట్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ కొడతాడని ఆశించినప్పటికీ నిరాశపరిచాడు. క్రీజులో చక్కగా కుదురుకున్న విరాట్ కోహ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడేలాగే కనిపించాడు. కానీ 45 పరుగుల వద్ద వ్యక్తిగత స్కోర్ వద్ద ఎంబుల్దేనియా బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో కోహ్లీ ఇన్నింగ్స్ ముగిసింది.

12వ ఆటగాడిగా
శ్రీలంకతో తొలి టెస్ట్ మ్యాచ్‌తో టీమిండియా వెటరన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కెరీర్లో 100 టెస్ట్ మ్యాచ్‌ల మైలురాయిని చేరుకున్నాడు. ఈ క్రమంలో 100 టెస్టులు ఆడిన 12వ భారత ఆటగాడిగా, ప్రపంచవ్యాప్తంగా 71వ ఆటగాడిగా నిలిచాడు. కోహ్లీ కంటే ముందు సచినల్ టెండూల్కర్ (200), రాహుల్ ద్రావిడ్ (163), వీవీఎస్ లక్ష్మణ్ (134), అనిల్ కుంబ్లే (132), కపిల్ దేవ్ (131), సునీల్ గవాస్కర్ (125), వెంగ్ సర్కార్ (116), సౌరవ్ గంగూలీ (113), ఇషాంత్ శర్మ (105), వీరేంద్ర సెహ్వాగ్ (103), హర్బజన్ సింగ్ (103) 100 టెస్టు మ్యాచ్‌లు ఆడారు.

తుది జట్లు
శ్రీలంక: దిముత్ కరుణరత్నే(కెప్టెన్), లహిరు తిరిమన్నె, పాతుమ్ నిస్సంక, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా, నిరోషన్ డిక్వెల్లా(వికెట్ కీపర్), సురంగ లక్మల్, విశ్వ ఫెర్నాండో, లసిత్ ఎంబుల్దెనియా, లహిరు కుమార.
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా.


Click it and Unblock the Notifications












