Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL 3rd T20: ఆ తప్పిదమే మా కొంపముంచింది- శ్రీలంక కెప్టెన్

పల్లెకెలె వేదికగా శ్రీలంకతో ఉత్కంఠ భరితంగా సాగిన ఆఖరి టీ20లో భారత్ సూపర్ ఓవర్‌లో ఘన విజయం సాధించింది. కుర్రాళ్ల అద్భుత పోరాటం, సూర్యకుమార్ యాదవ్ గొప్ప కెప్టెన్సీతో ఓటమి కోరల్లో నుంచి టీమిండియా బయటపడి గెలిచింది. మూడు టీ20ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.

మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 137 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ (39; 37 బంతుల్లో, 3 ఫోర్లు) టాప్ స్కోరర్. రియాన్ పరాగ్ (26; 18 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు), వాషింగ్టన్ సుందర్ (25; 18 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) సత్తాచాటారు. ఓ దశలో భారత్ స్కోరు 30/4, 48/5 మాత్రమే. ఈ స్థితిలో గిల్-పరాగ్-సుందర్ బ్యాటుతో గొప్ప పోరాటం చేశారు.

IND vs SL Sri Lankan Captain Asalanka Criticizes Batting Performance After 3rd T20 Loss to India in Super Over

ఛేదనలో శ్రీలంక 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి సరిగ్గా 137 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. తర్వాత సూపర్ ఓవర్‌లో లంక 3 బంతుల్లో 2 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం ఛేదనలో భారత్ తొలి బంతికే బౌండరీ బాది విజయం సాధించింది. అయితే మ్యాచ్ భారత్ గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. ఛేజింగ్‌లో లంక 15 ఓవర్లకు 108/1తో పటిష్టస్థితిలో నిలిచింది. ఆఖరి అయిదు ఓవర్లలో 30 పరుగులు అవసరం. చేతిలో తొమ్మిది వికెట్లు.

కానీ భారత బౌలర్లు 22 పరుగులే ఇచ్చి ఏడు వికెట్లు పడగొట్టారు. చివరి రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన రింకూ సింగ్, సూర్యకుమార్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీయడం విశేషం. వాషింగ్టన్ సుందర్ (2/23) విజయంలో కీలకపాత్ర పోషించాడు. కాగా, మ్యాచ్ అనంతరం తమ ఓటమికి గల కారణాలను శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక వివరించాడు. మిడిలార్డర్ పేలవమైన బ్యాటింగ్, షాట్లు ఎంపిక తప్పిదాలే తమ కొంపముంచాయని చెప్పాడు.

''మా బ్యాటింగ్ ప్రదర్శన పట్ల తీవ్ర నిరాశకు గురయ్యాను.మిడిల్ ఆర్డర్ పేలవంగా ఆడారు. చెత్త షాట్ల ఎంపికనే ప్రధాన కారణం. బంతి పాతకు అయ్యే కొద్ది, పరిస్థితికి తగ్గట్లుగా షాట్ సెలక్షన్ చేయాలి. ఈ పిచ్‌లపై బ్యాటింగ్ కష్టమే. కానీ మేం ఛేజింగ్ చేయగలిగే స్కోరే ఇది, సాకులు చెప్పలేం. ప్రొఫెషనల్ క్రికెటర్‌గా మేం మెరుగ్గా ఆడాల్సి ఉంది. హసరంగను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు పంపించిన వ్యూహాం ఫలించలేదు. ఇక వన్డేల్లో అయినా కాస్త మంచి బ్యాటింగ్ ప్రదర్శన చూడాలనుకుంటున్నా. మా టాప్ ఆర్డర్ ఒక్కటే సానుకూలాంశం'' అని చరిత్ అసలంక పేర్కొన్నాడు. కాగా, శుక్రవారం నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.

Story first published: Wednesday, July 31, 2024, 7:07 [IST]
Other articles published on Jul 31, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+