భారత్‌తో టీ20 సిరీస్: 16 నెలల తర్వాత జట్టులోకి మాథ్యూస్.. శ్రీలంక జట్టు ఇదే!!

కొలంబో: ఈ నెల 5 నుండి భారత్-శ్రీలంక జట్ల మధ్య టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే బీసీసీఐ టీమిండియా జట్టును ప్రకటించగా.. తాజాగా శ్రీలంక బోర్డు కూడా 16 మందితో కూడిన జట్టుని ప్రకటించింది. పేసర్ లసిత్ మలింగ టీ20 జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు మోయనున్నాడు. ఆల్‌రౌండర్ ఏంజిలో మాథ్యూస్ దాదాపు 16 నెలల తర్వాత మళ్లీ టీ20 జట్టులోకి వచ్చాడు.

పటిష్టంగా లంక:
ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న లసిత్ మలింగాకి భారత పిచ్‌లపై మంచి అవగాహన అంది. దీనికి తోడు మాథ్యూస్ కూడా జట్టులో చేరాడు. కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్, ఇసుర ఉదాన లాంటి సీనియర్ క్రికెటర్లు కూడా ఉండడంతో జట్టు పటిష్టంగా మారింది. ఇటీవలే పాకిస్థాన్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసింది. అదే జోరుని టీమిండియాపైనా కొనసాగించాలని లంక చూస్తోంది.

ఫామ్‌లో టీమిండియా:
ఇటీవల అద్భుత ఫామ్‌లో ఉన్న టీమిండియా తాజాగా వెస్టిండీస్‌తో ముగిసిన మూడు టీ20ల సిరీస్‌ని 2-1తో కైవసం చేసుకుంది. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ ఫామ్‌లో ఉండడం కలిసొచ్చే అంశం. అయితే బౌలింగ్ బలహీనత ఆ సిరీస్‌లో కనబడింది. ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా పునరాగమనంతో ఆ లోటు కనబడే అవకాశం లేదు.

జనవరి 5న తొలి టీ20:
తొలి టీ20 మ్యాచ్ జనవరి 5న గౌహతి వేదికగా జరగనుంది. రెండో టీ20 7న ఇండోర్‌లో, చివరి టీ20 మ్యాచ్ 10న పుణెలో జరగనుంది. అన్ని మ్యాచ్‌లు భారత కాలమాన ప్రకారం రాత్రి 7 గంటల నుంచి ప్రారంభమవుతాయి. లంక జట్టు అతి త్వరలో భారత్ రానుంది. మరోవైపు భారత ఆటగాలు కూడా జట్టుతో కలవనున్నారు.

శ్రీలంక టీ20 జట్టు:
లసిత్ మలింగ (కెప్టెన్), కుశాల్ పెరీరా, దనుశ్ గుణతిలక, అవిష్కా ఫెర్నాండో, భనుక రాజపక్సె, ఒసాడ ఫెర్నాండో, దసున్ శనక, ఏంజిలో మాథ్యూస్, నిరోషన్ డిక్వెల్లా, కుశాల్ మెండిస్, హసనరంగ, లక్ష్యన్ సందకన్, ధనంజయ డిసెల్వా, లాహిరు కుమార, ఇసురు ఉదాన.
'లక్ష్మణ్ చేసిన ఆ 96 పరుగులే గత దశాబ్దపు అత్యుత్తమ ప్రదర్శన'
భారత టీ20 జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), మనీశ్ పాండే, సంజు శాంసన్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, శార్ధూల్ ఠాకూర్, నవదీప్ షైనీ, జస్‌ప్రీత్ బుమ్రా.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications