Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL 3rd T20: వారిద్దరిపై వేటు.. శ్రీలంకతో భారత్ ఆడే తుదిజట్టు ఇదే!

శ్రీలంక పర్యటనలో భారత్ టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు టీ20ల సిరీస్‌ను 2-0తో సాధించింది. ఇక మిగిలిన ఆఖరి టీ20 మ్యాచ్ రేపు రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈ నామమాత్రపు పోరుకు పల్లెకెలె వేదికగా కానుంది. టీ20 సిరీస్‌లో ఆఖరి పంచ్ కూడా అదిరేలా సత్తాచాటాలని టీమిండియా భావిస్తోంది.

ఆతిథ్య జట్టు శ్రీలంకకు అవకాశం ఇవ్వకుండా చెలరేగాలని భారత్ పట్టుదలతో ఉంది. అయితే ఈ ఆఖరి పోరులో బెంచ్‌కు పరిమితమైన ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని కోచ్ గౌతమ్ గంభీర్- కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ యోచిస్తున్నారు. ఇప్పటికే సిరీస్‌ గెలవడంతో బెంచ్‌ బలాన్ని కూడా నిరూపించుకోవాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్‌ను జట్టు నుంచి తప్పించాలని భావిస్తున్నారు.

IND vs SL Shivam Dube and Washington Sundar Set to Replace Hardik Pandya and Axar Patel for Final T20 Against Sri Lanka

హార్దిక్, అక్షర్ స్థానాల్లో శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్ జట్టులోకి రానున్నారు. మరోవైపు ఓపెనర్లుగా యశస్వీ జైస్వాల్- సంజు శాంసన్ కొనసాగనున్నారు. మెడనొప్పి కారణంగా శుభ్‌మన్ గిల్ రెండో టీ20కు దూరమైన విషయం తెలిసిందే. గిల్ స్థానంలో శాంసన్ తుదిజట్టులోకి వచ్చాడు. అయితే గోల్డెన్ డకౌటైన శాంసన్‌కు మరో అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. పంత్, రియాన్ పరాగ్, రింకూ సింగ్ జట్టులో కొనసాగనున్నారు.

మరోవైపు మహ్మద్ సిరాజ్‌ లేదా అర్షదీప్ సింగ్‌కు బదులుగా ఖలీల్ అహ్మద్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఖలీల్, అర్షదీప్ ఇద్దరూ ఎడమచేతి వాటం బౌలర్లే. ఈ నేపథ్యంలో సిరాజ్‌కు విశ్రాంతి ఇచ్చి వీరిద్దరిని తుదిజట్టులో ఆడించాలనుకుంటే హార్దిక్ జట్టులో కొనసాగుతాడు. అప్పుడు దూబె బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది.

భారత తుది జట్టు(అంచనా)
యశస్వీ జైస్వాల్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రిషభ్ పంత్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్య/శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్/మహ్మద్ సిరాజ్.

భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, రిషభ్ పంత్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్.

Story first published: Monday, July 29, 2024, 12:36 [IST]
Other articles published on Jul 29, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+