IND vs SL 3rd ODI: మా ఓటమికి కారణం అదే: శిఖర్ ధావన్

కొలంబో: శ్రీలంకతో జరిగిన చివరి వన్డే మ్యాచ్‌లో భారత్‌ ఓటమికి గల కారణాలను కెప్టెన్ శిఖర్ ధావన్ వెల్లడించాడు. మెరుగైన ఆరంభం లభించినా.. మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు చేజార్చుకున్నామన్నాడు. కొత్త ఆటగాళ్లకి అవకాశం ఇచ్చామని, కానీ ఆశించిన విధంగా ఫలితం రాలేదని గబ్బర్ పేర్కొన్నాడు. వరుసగా రెండు విజయాలతో జోరు మీద కనిపించిన టీమిండియా.. మూడో వన్డేలో ఓటమిపాలింది. అప్పటికే సిరీస్ గెలవడంతో చివరి మ్యాచులో గబ్బర్ సేన భారీ మార్పులతో బరిలోకి దిగింది. ఏకంగా ఐదుగురు ఆటగాళ్లు వన్డే డెబ్యూ ఇచ్చారు.

ఆశించిన విధంగా ఫలితం రాలేదు

ఆశించిన విధంగా ఫలితం రాలేదు

మ్యాచ్ అనంతరం శిఖర్ ధావన్ మాట్లాడుతూ... 'సరైన విధంగా ఆడలేదు. మేము కొంతమంది కొత్త ఆటగాళ్లను ప్రయత్నించాము. మ్యాచ్‌లో మాకు మెరుగైన ఆరంభం లభించింది. కానీ మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు చేజార్చుకున్నాం. దాంతో చివరికి ఆశించిన దానికంటే ఓ 50 పరుగులు తక్కువగా చేశాం. చాలా కాలం పాటు క్వారంటైన్‌లో ఉన్న ప్లేయర్స్ అరంగేట్రం చేసినందుకు నేను సంతోషిస్తున్నాను. వన్డే సిరీస్ అప్పటికే సొంతం చేసుకోవడంతో.. చివరి మ్యాచులో కొత్త ఆటగాళ్లకి అవకాశం ఇచ్చాం. కానీ మేము ఆశించిన విధంగా ఫలితం రాలేదు' అని అన్నాడు.

మంచి పోరాటం చేశారు

మంచి పోరాటం చేశారు

'ఎక్కడ మెరుగుపడగలం మరియు వ్యూహాలు మెరుగ్గా ఎలా అమలుచేయగలం అని నేను ఎల్లప్పుడూ విశ్లేషిస్తాను. తప్పిదాల్ని దిద్దుకుని.. టీ20 సిరీస్‌లో సత్తాచాటుతాం. మేము లక్ష్యాన్ని కాపాడుకోగలమని సానుకూలంగా ఉన్నాము. కాని మేము తక్కువ పరుగులు చేశామని తెలుసు. ఆటగాళ్లు అందరూ మంచి పోరాటం చేశారు. చివరికి మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. మనం ఎప్పుడూ నేర్చుకోవడం కొనసాగించాలి' అని టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ పేర్కొన్నాడు. చివరి వన్డేలో ఏకంగా ఐదుగురు ఆటగాళ్లు భారత్ తరఫున అరంగేట్రం చేశారు. సంజు శాంసన్, నితీష్ రాణా, కృష్ణప్ప గౌతమ్, చేతన్ సకారియా, రాహుల్ చహర్ మొదటిసారి వన్డే క్యాప్ అందుకున్నారు.

Tokyo Olympics 2021: ఆర్చ‌రీ మిక్స్‌డ్ ఈవెంట్‌లో ముగిసిన భార‌త్ పోరు!!

ఆదుకున్న ఫెర్నాండో, రాజపక్స

ఆదుకున్న ఫెర్నాండో, రాజపక్స

తొలుత భారత్‌ 43.1 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ పృథ్వీ షా (49 బంతుల్లో 49; 8 ఫోర్లు), అరంగేట్రం చేసిన సంజూ శాంసన్ (46 బంతుల్లో 46; 5 ఫోర్లు, 1 సిక్స్‌), సూర్యకుమార్‌ యాదవ్‌ (37 బంతుల్లో 40; 7 ఫోర్లు) రాణించారు. అకిల ధనంజయ, ప్రవీణ్‌ జయవిక్రమ చెరో మూడు వికెట్లు తీశారు. ఛేజింగ్‌లో శ్రీలంక 39 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 227 పరుగులు చేసి నెగ్గింది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవిష్క ఫెర్నాండో (98 బంతుల్లో 76; 4 ఫోర్లు, 1 సిక్స్‌), భానుక రాజపక్స (56 బంతుల్లో 65; 12 ఫోర్లు) అర్ధ సెంచరీలతో జట్టుకు గెలుపు బాటలు వేశారు. సూర్యకు 'మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌' అవార్డు దక్కింది.

ఆదివారం తొలి టీ20

ఆదివారం తొలి టీ20

సొంతగడ్డపై భారత్‌ చేతిలో 10 మ్యాచ్‌ల పరాజయాల పరంపరకు తెరదించుతూ ఎట్టకేలకు శ్రీలంక విజయాన్ని అందుకుంది. శుక్రవారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో శ్రీలంక మూడు వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన భారత్‌ సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. భారత్, శ్రీలంక మధ్య కొలంబో వేదికగా ఆదివారం నుంచి టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనుభవం ఉన్న భారత యువ ఆటగాళ్లు సత్తాచాటేందుకు ఇవ్విళూరుతున్నారు

ఐసీసీ టీ-20 ప్రపంచ కప్ 2021 ప్రిడిక్షన్
Match 23 - October 29 2021, 03:30 PM
వెస్టిండిస్
బంగ్లాదేశ్
Predict Now
For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Saturday, July 24, 2021, 13:17 [IST]
Other articles published on Jul 24, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X