For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SL: సంజు శాంసన్ లేజీ బ్యాట్స్‌మన్‌.. ఒక్క టీ20లో అయినా బాధ్యతగా ఆడాడా: సల్మాన్

IND vs SL: Salman Butt feels Sanju Samson seems like a lazy batsman

కరాచీ: కేరళ యువ వికెట్ కీపర్, టీమిండియా బ్యాట్స్‌మన్‌ సంజు శాంసన్‌పై పాకిస్థాన్‌ మాజీ ఓపెనర్ సల్మాన్‌ బట్‌ మండిపడ్డాడు. జట్టులో కీలక బ్యాట్స్‌మన్‌ లేని సమయంలో బాధ్యతగా ఆడాల్సింది పోయి.. నిర్లక్ష్యంగా ఆడాతాడా? అని చురకలు అంటించాడు. వచ్చిన అవకాశాలను సంజు మిస్ చేసుకున్నాడని బట్‌ పేరొన్నాడు. మళ్లీ భారత జట్టులో అతడికి చోటు దక్కడం కష్టమే అని అతడు అభిప్రాయపడ్డాడు. లంక పర్యటనలో భారత్ వన్డే సిరీస్‌ను 2-1తో తేడాతో గెలుచుకోగా.. టీ20 సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయింది. భారత ప్రధాన జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉండగా.. యువకులతో కూడిన జట్టు లంకలో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడాయి.

మూడు టీ20లలో కలిపి 34 పరుగులే:

మూడు టీ20లలో కలిపి 34 పరుగులే:

ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌లో సంజు శాంసన్ రాణించడంతో అంతర్జాతీయ ఫార్మాట్‌లో అద్భుతంగా రాణిస్తాడని అందరూ భావించారు. కానీ జట్టులో పోటీ కారణంగా అతడికి ఆడే అవకాశాలు ఎక్కువగా రాలేదు. 2015లో జాతీయ జట్టులోకి వచ్చిన సంజు.. లంక పర్యటన ముందు వరకు ఆడింది కేవలం 7టీ20లు మాత్రమే. దీంతో సంజుకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వట్లేదని బీసీసీఐపై ఓ అపవాదు ఉంది. అయితే లంక పర్యటన రూపంలో వచ్చిన అవకాశాన్ని అతడు ఉపయోగించుకోలేదు. మూడో వన్డేలో 46 పరుగులు చేసి పర్వాలేదనిపించినా.. మూడు టీ20లలో కలిపి 34 పరుగులే చేసి నిరాశపరిచాడు. కీలక సమయంలో వికెట్ పారేసుకుని విమర్శల పాలయ్యాడు.

శాంసన్ లేజీ బ్యాట్స్‌మన్‌:

శాంసన్ లేజీ బ్యాట్స్‌మన్‌:

పాకిస్థాన్‌ మాజీ ఓపెనర్ సల్మాన్‌ బట్‌ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ... 'సంజు శాంసన్ నాకు లేజీ బ్యాట్స్‌మన్‌గా కనిపిస్తాడు. మీరు ఓ బౌలర్ (వనిందు హసరంగ)ను ఎదుర్కోలేరని ముందే తెలిసినప్పుడు.. ప్యాడ్‌ను బ్యాట్ ముందు ఉంచుకుని ఆడాలి. కానీ సంజు మాత్రం బంతిని బ్యాక్ ఫుట్ తీసుకుని ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆ క్రమంలోనే ఔట్ అవుతున్నాడు. జట్టులో ఐదుగురు బ్యాట్స్‌మన్‌లు మాత్రమే ఉన్నారు. అందులో సంజు ఒకడు. ఇద్దరు ఇప్పటికే అవుట్ అయ్యారని తెలిసినప్పుడు.. మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆ ప్రయత్నం సంజులో నేను చూడలేదు' అని అన్నాడు. బట్‌ పాక్ తరఫున 33 టెస్టులు, 78 వన్డేలు, 24 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

ఐదుగురు బ్యాట్స్‌మన్‌లతోనే:

ఐదుగురు బ్యాట్స్‌మన్‌లతోనే:

రెండో టీ20 మ్యాచుకు ముందు స్టార్ ఆల్‌రౌండర్‌ కృనాల్ పాండ్యాకి కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. అతనితో క్లోజ్‌ కాంటాక్ట్‌లో ఉన్న 8 మంది ఆటగాళ్లను బీసీసీఐ ఐసోలేషన్‌కి తరలించింది. పాండ్యాతో సన్నిహితంగా ఉన్న పృథ్వీ షా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దీపక్ చహర్, యుజ్వేంద్ర చహల్, మనీశ్ పాండే‌లు చివరి రెండు టీ20లకి దూరమయ్యారు. దాంతో భారత్‌ భారీ మార్పులతో బరిలోకి దిగింది. స్టార్ ప్లేయర్స్ అందుబాటులో లేకపోవడంతో.. ఐదుగురు బ్యాట్స్‌మన్‌లతోనే గబ్బర్ సేన ఆడింది. ఈ అవకాశాన్ని సంజు శాంసన్ సద్వినియోగం చేసుకోలేదు.

ధావన్‌ది పూర్ కెప్టెన్సీ:

ధావన్‌ది పూర్ కెప్టెన్సీ:

తాజాగా డానిష్ కనేరియా తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ... 'భువనేశ్వర్ కుమార్ 6వ స్థానంలో బాగా బ్యాటింగ్ చేయగలడు. అలాంటప్పుడు మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎందుకు ఎంచుకోలేదు. ప్రేమదాస పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంది. ముందుగా బౌలింగ్ చేసి.. లంకను 100 పరుగుల లోపు పరిమితం చేయవచ్చు. ఆరుగురు బౌలర్లు జట్టులో ఉన్నారు కాబట్టి ముందుగా బౌలింగ్ చేసుంటే బాగుండేది. ఇది శిఖర్ ధావన్‌ పూర్ కెప్టెన్సీకి ఓ ఉదాహరణే అని చెప్పొచ్చు' అని పేర్కొన్నాడు.

Story first published: Saturday, July 31, 2021, 19:09 [IST]
Other articles published on Jul 31, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+