
వచ్చే ఏడాదిని టీ20 సిరిస్‌తో
అయితే, వచ్చే ఏడాదిని టీమిండియా శ్రీలంక జట్టుతో జరగనున్న టీ20 సిరిస్‌తో ప్రారంభించనుంది. భారత పర్యటనలో భాగంగా శ్రీలంక మూడు టీ20ల సిరిస్ ఆడనుంది. తొలి టీ20 జనవరి 5న గౌహతి వేదికగా ప్రారంభం కానుంది. ఆ తర్వాత 7వ తేదీన ఇండోర్, 10వ తేదీన పూణె వేదికగా జరగనుంది.

లంకతో మూడు టీ20ల సిరిస్
శ్రీలంకతో మూడు టీ20ల సిరిస్ నుంచి టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చే అలోచనలో సెలక్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీలంకతో జరిగే ఈ సిరీస్‌లో తలపడే భారత జట్టును డిసెంబర్ 26వ తేదీన ప్రకటించనున్నారు. రోహిత్ శర్మ విశ్రాంతిపై బోర్డు అధికారి ఒకరు స్పందించారు.

రోహిత్ శర్మకు విశ్రాంతి
"సాధారణంగా సెలక్టర్లు ఎవరికీ విశ్రాంతి ఇవ్వరు. కానీ, రోహిత్ శర్మ గత కొంత కాలంగా విశ్రాంతి లేకుండా ఆడుతున్నాడు. అందుకే అతనికి విశ్రాంతి ఇవ్వాలని బోర్డు భావిస్తోంది" అని తెలిపారు. రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో అతడి స్థానంలో గాయం నుంచి కోలుకున్న శిఖర్ ధావన్‌ను జట్టులోకి తీసుకుంటారు.

జనవరి చివర్లో భారత పర్యటనకు ఆసీస్
భారత్‌లో శ్రీలంక జట్టు పర్యటన ముగిసిన తర్వాత జనవరి చివర్లో ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటిచనుంది. ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య మూడు వన్డేల సిరిస్ జరగనుంది. ఆస్ట్రేలియాతో సిరిస్‌కు రోహిత్ శర్మను జట్టులోకి తీసుకొనే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications












