For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SL: అతనితోనే రోహిత్-గంభీర్‌కు తలనొప్పి!

శ్రీలంక పర్యటనలో టీ20 వరల్డ్ కప్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత్ మరో సిరీస్‌కు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా కొలంబో వేదికగా ఇవాళ తొలి మ్యాచ్ జరగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న నేపథ్యంలో ఈ వన్డే సిరీస్‌ను సద్వినియోగం చేసుకోవాలని, జట్టు కూర్పుపై ఓ అంచనాకు రావాలని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, నయా కోచ్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడుతున్నారు.

అయితే ఆటగాళ్ల రీఎంట్రీలు రోహిత్-గంభీర్‌కు తలనొప్పిగా మారాయి. ప్రధానంగా రిషభ్ పంత్ వన్డే ఫార్మాట్‌లోకి పునరాగమనం జట్టుకూర్పుపై ప్రభావం చూపుతుంది. పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లలో ఇద్దరికి మాత్రమే జట్టులో స్థానం దక్కే అవకాశం ఉంది. అయితే ఈ ముగ్గురు మొనగాళ్లలో ఎవరిని ఎంచుకోవాలదే అసలు ప్రశ్న.

IND vs SL Rohit and Gambhir s Dilemma Choosing Between KL Rahul Shreyas Iyer and Rishabh Pant for ODI Series Against Sri Lanka

వన్డే వరల్డ్ కప్-2023 తర్వాత భారత్ మూడు వన్డేలు ఆడింది. ఈ మ్యాచ్‌లకు రాహుల్ సారథిగా వ్యవహరించాడు. గత ఆసియా కప్ నుంచి రాహుల్ వన్డేల్లో సూపర్ ఫామ్‌లో కొనసాగతున్నాడు. 21 మ్యాచ్‌ల్లో 69 సగటుతో 834 పరుగులు చేశాడు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ కూడా గత కొంతకాలంగా 50 ఓవర్ల ఫార్మాట్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. వన్డే వరల్డ్ కప్‌లో 66 సగటుతో 530 పరుగులు చేశాడు. రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ జట్టుకు దూరమవ్వడంతో మిడిలార్డర్‌లో శ్రేయస్-రాహుల్ వన్డే జట్టులో స్థిరపడ్డారు.

అయితే టీ20 వరల్డ్ కప్‌తో పొట్టి ఫార్మాట్‌‌లో రీఎంట్రీ ఇచ్చిన పంత్ ఇక వన్డేలకు సిద్ధమయ్యాడు. ఎక్స్ ఫ్యాక్టర్‌గా భావించే పంత్‌ను తుదిజట్టు‌లో ఎంపిక చేస్తే శ్రేయస్-రాహుల్‌లో ఒకరు చోటు కోల్పోతారు. ఈ నేపథ్యంలో గంభీర్-రోహిత్ తలపట్టుకున్నారు. ఎడమచేతి వాటం పంత్‌కు కలిసొచ్చేలా ఉంది. ప్రస్తుత జట్టులో పంత్‌తో పాటు అక్షర్ పటేల్, సుందర్, శివమ్ దూబె లెఫ్ట్ హ్యాండర్లు. అక్షర్ మినహా మిగిలిన వాళ్లకు జట్టులో చోటు గ్యారెంటీ లేదు. దీంతో పంత్‌కు అవకాశం ఇవ్వాలని భావిస్తే కేఎల్ రాహుల్/శ్రేయస్ అయ్యర్‌లలో ఒకరిపై వేటు పడుతుంది. ఈ పరిస్ధితిలో రాహుల్‌కు బదులుగా శ్రేయస్‌నే గంభీర్ ఎంపిక చేసే అవకాశం ఉంది.

IND vs SL Rohit and Gambhir s Dilemma Choosing Between KL Rahul Shreyas Iyer and Rishabh Pant for ODI Series Against Sri Lanka

శ్రీలంకతో తొలి వన్డే ఆడే భారత తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్/రిషభ్ పంత్, రియాన్ పరాగ్, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.

శ్రీలంక పర్యటనకు ఎంపికైన భారత వన్డే జట్టు:
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, రియాన్ పరాగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్, హర్షిత్ రాణా, ఖలీల్ అహ్మద్ .

Story first published: Friday, August 2, 2024, 9:18 [IST]
Other articles published on Aug 2, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+