IND vs SL: శ్రీలంక పర్యటన సక్సెస్.. టీమిండియా ఫుల్ టైమ్ కోచింగ్‌పై రాహుల్ ద్రవిడ్‌ ఏమన్నాడంటే?

Ind vs SL 2021: Rahul Dravid - I'm Not Thinking About Becoming Full-Time India Coach

కొలంబో: గతంలో ఎన్నడూ లేనివిధంగా భారత క్రికెట్ జట్టు రెండు వేర్వేరు దేశాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ నాయకత్వంలో సీనియర్లతో కూడిన జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉండగా.. శిఖర్ ధావన్ కెప్టెన్సీలో యువకులతో కూడిన జట్టు శ్రీలంక టూర్‌లో ఉంది.

భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లడంతో.. టీమిండియా మాజీ కెప్టెన్, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) హెడ్ రాహుల్‌ ద్రవిడ్‌ లంకకు వెళ్లిన బృందానికి కోచ్‌గా వ్యవహరించాడు. ద్రవిడ్ ఆధ్వర్యంలో యువ భారత జట్టు వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. అయితే కరోనా కారణంగా స్టార్ ఆటగాళ్లు దూరమవడంతో టీ20 సిరీస్‌ను ధావన్ సేన 2-1తో కోల్పోయింది.

ద్రవిడ్ సక్సెస్

ద్రవిడ్ సక్సెస్

శ్రీలంక పర్యటనలో రాహుల్ ద్రవిడ్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. పటిష్ట శ్రీలంకతో యువ భారత్ చేసిన పోరాటం అందరిని ఆశ్చర్యపరిచింది. ఇందుకు కారణం ద్రవిడ్. యువకులకు అండగా ఉంటూ.. వారికి ఎంతో స్ఫూర్తినిచ్చాడు. సరైన సమయంలో సూచనలు, సలహాలు ఇస్తూ జట్టును తనదైన శైలిలో ముందుకునడిపించాడు.

మరోవైపు టీమిండియా ప్రధాన హెడ్ కోచ్ ర‌విశాస్త్రి కూడా విజయవంతం అయ్యాడు. అయితే అత‌ని ప‌ద‌వీకాలం ఈ ఏడాది చివ‌ర్లో జ‌ర‌గ‌నున్న టీ20 ప్రపంచకప్‌తో ముగియ‌నుంది. దీంతో అత‌ని స్థానంలో ద్రవిడ్ వస్తాడని అందరూ అంచనా వేస్తున్నారు. ఇదే విషయాన్ని ద్రవిడ్‌ను అడగ్గా.. ఇప్పుడే అంతదూరం ఆలోచించలేదు అని చెప్పాడు.

అంతదూరం ఆలోచించలేదు

అంతదూరం ఆలోచించలేదు

శ్రీలంకతో టీ20 సిరీస్‌ అనంతరం రాహుల్ ద్రవిడ్ స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా టీమిండియా ఫుల్ టైమ్ కోచింగ్‌పై మీ అభిప్రాయం ఏంటని అడగ్గా.. 'లంక పర్యటనను ఆస్వాదించాను. ఈ అనుభవం బాగుంది. నిజాయితీగా చెప్పాలంటే.. ఫుల్ టైమ్ కోచింగ్‌పై ఇంకా ఆలోచించలేదు. నాకు అసలు ఆ ఆలోచనే రాలేదు.

ఇప్పుడు నేను చేస్తున్న పనితో సంతోషంగా ఉన్నా. ఈ టూర్‌ని ఆస్వాదించడం తప్ప.. మరే ఆలోచనలు చెయ్యట్లేదు. ఈ కుర్రాళ్లతో పనిచేయడం చాలా ఇష్టం. ఇది చాలా బాగుంది. మీకు ఓ విషయం చెప్పాలి.. ఫుల్ టైమ్ కోచింగ్‌ అంటే ఎన్నో సవాళ్లు ఉంటాయి. అవన్నీ నాకు తెలియదు' అని ద్రవిడ్ అన్నాడు.

IND vs SL:భారత జట్టులో మరోసారి కరోనా కలకలం..ఇద్దరు ఆటగాళ్లకు పాజిటివ్!ఆందోళనలో బీసీసీఐ!!

కోచ్‌గా పనిచేయడం ఇది రెండోసారి

కోచ్‌గా పనిచేయడం ఇది రెండోసారి

రాహుల్ ద్రవిడ్ టీమిండియాకు కోచ్‌గా పనిచేయడం ఇది రెండోసారి. 2014లో ఇంగ్లండ్‌తో జరిగిన పర్యటనలో బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా జట్టుతో పాటు వెళ్లాడు. 2018 లో పృథ్వీ షా నాయకత్వంలో భారత అండర్ 19 జట్టు న్యూజిలాండ్‌లో జరిగిన ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. అప్పుడు జట్టు కెప్టెన్ రాహుల్ ద్రవిడ్. చాలా సంవత్సరాలుగా యువ క్రికెటర్లు ద్రవిడ్ పనిని, అతని పద్ధతులను ప్రశంసిస్తున్నారు. 2019లో అతను జాతీయ క్రికెట్ అకాడమీకి ప్రధాన కోచ్‌గా కూడా నియామకం అయ్యాడు. అప్పటినుంచి ఎందరో కుర్రాళ్లు భారత జట్టులోకి ఎంపికవుతున్నారు.

 గతంలో విదేశీ కోచ్‌ల‌నే న‌మ్ముకున్నా

గతంలో విదేశీ కోచ్‌ల‌నే న‌మ్ముకున్నా

టీమిండియా హెడ్ కోచ్ ప‌ద‌వి అత్యంత విలువైన‌ది. చాలా కాలం పాటు బీసీసీఐ విదేశీ కోచ్‌ల‌నే న‌మ్ముకున్నా.. ఆ త‌ర్వాత ప‌రిస్థితిలో మార్పు వ‌చ్చింది. భారత మాజీలు అనిల్ కుంబ్లే, ర‌విశాస్త్రిలు హెడ్‌ కోచ్‌లుగా నియమితులయ్యారు. వారి కాలంలో టీమిండియా అద్భుత‌మైన విజ‌యాలు సాధించింది. ముఖ్యంగా రవిశాస్త్రి హెడ్‌కోచ్ అయిన త‌ర్వాత రెండుసార్లు ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలోనే ఓడించింది కోహ్లీసేన.. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైన‌ల్‌కు కూడా చేరింది. అయితే అత‌ని ప‌ద‌వీకాలం ఈ ఏడాది చివ‌ర్లో జ‌ర‌గ‌నున్న టీ20 ప్రపంచకప్‌తో ముగియ‌నుంది. దీంతో అత‌ని త‌ర్వాత ఎవ‌రు అన్న చ‌ర్చ ప్రారంభ‌మైంది.

ఐసీసీ టీ-20 ప్రపంచ కప్ 2021 ప్రిడిక్షన్
Match 23 - October 29 2021, 03:30 PM
వెస్టిండిస్
బంగ్లాదేశ్
Predict Now
For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, July 30, 2021, 14:22 [IST]
Other articles published on Jul 30, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X