టీమిండియా కోచ్‌గా గౌతమ్ గంభీర్ తొలి సిరీస్‌ను విజయవంతంగా ముగించాడు. శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. సూపర్ ఓవర్‌కు దారితీసిన ఆఖరి టీ20లో అద్భుత పోరాటంతో టీమిండియా విజయం సాధించింది. అయితే విజయానంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో టీ20 సిరీస్ ప్రదర్శన గురించి గంభీర్ మాట్లాడాడు.
జట్టు ప్రదర్శనపై నయా కోచ్ గంభీర్ సంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ఎంపిక కానీ ఆటగాళ్లను గంభీర్ హెచ్చరించాడు. తిరిగి భారత జట్టులో చేరడానికి మరో మూడు నెలలు సమయం పడుతుందని, అప్పటివరకు ఫిట్‌నెస్, ఆటను మెరుగుపర్చుకోవడంపై దృష్టి సారించాలని సూచించాడు. కొన్ని రోజుల ముందు సన్నద్ధమైతే సరిపోతుందని నిర్లక్ష్యం వహిస్తే కుదరదని గంభీర్ వార్నింగ్ ఇచ్చాడు.

సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, సంజు శాంసన్, యశస్వీ జైస్వాల్, రింకూ సింగ్, రవి బిష్ణోయ్ వంటి ఆటగాళ్లు టీ20 జట్టుకే పరిమితమయ్యారు. వన్డే జట్టులో చోటు దక్కించులేకపోయారు. ఈ ఆటగాళ్లను ఉద్దేశిస్తూ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ''వన్డే జట్టులో లేని ఆటగాళ్లకు సుదీర్ఘ విరామం లభించనుంది. బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు తిరిగి వచ్చే ముందు ఫిట్‌నెస్ లెవల్, నైపుణ్యాలను మెరుగుపర్చుకోండి''
''అంతేకానీ, ఆ సిరీస్‌కు ముందు సన్నద్ధమవ్వగలని భావిస్తే కుదరదు. ఆ సమయంలో పూర్తి స్థాయిలో ఫిటెనెస్ ఉండాలి'' అని గంభీర్ పేర్కొన్నాడు. ఆగష్టు 2 నుంచి శ్రీలంకతో భారత్ మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. అనంతరం సెప్టెంబర్ మధ్యలో బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత అక్టోబర్ ఆరంభంలో బంగ్లాతో మూడు టీ20ల సిరీస్ జరగనుంది. దీంతో టీ20 జట్టులోనే ఉన్న భారత ఆటగాళ్లకు దాదాపు మూడు నెలల విరామం లభించనుంది.
శ్రీలంక వన్డే సిరీస్‌కు టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబె, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.