Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గాలే టెస్ట్‌కు ముందు టీమిండియాకు శ్రీలంక కెప్టెన్ స్ట్రాంగ్ వార్నింగ్!

IND vs SL: శ్రీలంకలోని గాలే అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఆగస్టు 15 నుంచి భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండు మ్యాచ్‪ ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్ ప్రారంభం కానుంది. తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టు టెస్ట్ సిరీస్ ఆడేందుకు శ్రీలంకలో అడుగుపెట్టింది.ఈ నేపథ్యంలో శ్రీలంక కెప్టెన్ ధనంజయ డి సిల్వా మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీమిండియాను హెచ్చరించారు. ఆతిథ్య శ్రీలంక జట్టును తేలికగా తీసుకోవద్దని.. ఈ సిరీస్‌ టీమిండియాకు అంత సులభంగా ఉండబోదని స్పష్టం చేశారు.

2022 తర్వాత తొలిసారి ముఖాముఖి పోరు
భారత్, శ్రీలంక జట్లు చివరిసారిగా 2022లో బెంగళూరులో డే-నైట్ టెస్టులో తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా 238 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అయితే ఆ తర్వాత ఈ రెండు జట్లు సుదీర్ఘ కాలం పాటు టెస్టుల్లో ఎదురు పడలేదు. ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పరంగా ఈ సిరీస్ అత్యంత కీలకమైనదని.. ప్రస్తుతం స్టాండింగ్స్ లో మెరుగైన స్థానంలో ఉన్న శ్రీలంక భారత్ కు గట్టి పోటీనిస్తుందని ధనంజయ డి సిల్వా ధీమా వ్యక్తం చేశారు.

IND vs SL Galle Test Sri Lanka captain Dhananjaya de Silva Warns Team India Ahead of 1st Test

గాలే పిచ్ బ్యాటింగ్ కు అనుకూలం
సాధారణంగా గాలే స్టేడియం పిచ్ స్పిన్నర్లకు విపరీతంగా సహకరిస్తుందనే పేరుంది. అయితే ఈ సారి పిచ్ పరిస్థితులు భిన్నంగా ఉంటాయని శ్రీలంక కెప్టెన్ తెలిపారు. గత కొన్ని రోజులుగా పడుతున్న వర్షాల కారణంగా గ్రౌండ్ సిబ్బంది పూర్తి స్థాయిలో పిచ్ ను సిద్ధం చేయలేకపోయినప్పటికీ.. ఈ వికెట్ బ్యాటర్లకు బాగా సహకరిస్తుందని ఆయన వెల్లడించారు. ఇరు జట్ల బ్యాటర్లకు మంచి పరుగులు సాధించే అవకాశం ఉంటుందని డి సిల్వా అభిప్రాయపడ్డారు.

డిక్వెల్లా రీ-ఎంట్రీ, యువ స్పిన్నర్ అరంగేట్రం
గాయపడిన కుశాల్ మెండిస్ స్థానంలో సీనియర్ వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లాను జట్టులోకి తీసుకోవడంపై డి సిల్వా వివరణ ఇచ్చారు. 'గాలే స్టేడియంలో వికెట్ కీపింగ్ చేయడం చాలా సవాలుతో కూడుకున్నది. అందుకే టాలెంటెడ్ వికెట్ కీపర్ అవసరం ఏర్పడింది" అని శ్రీలంక కెప్టెన్ తెలిపారు. అలాగే ఈ మ్యాచ్ ద్వారా యువ ఆఫ్ స్పిన్నర్ కేశర నువంత టెస్టుల్లోకి అరంగేట్రం చేసే అవకాశం ఉందని తెలిపారు.

Story first published: Friday, August 14, 2026, 18:54 [IST]
Other articles published on Aug 14, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+