Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: శ్రీలంక జట్టులో భారీ మార్పులు..కొత్త కెప్టెన్‌ వచ్చాడు!

భారత్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు శ్రీలంక తమ జట్టును ప్రకటించింది. పల్లకెలె వేదికగా జులై 27 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్‌కు 16 మందితో కూడిన బృందాన్ని వెల్లడించింది. జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చాడు. వానిందు హసరంగా సారథి బాధ్యతల నుంచి తప్పుకోవడంతో చరిత్ అసలంక జట్టు పగ్గాలు అందుకున్నాడు.

టీ20 వరల్డ్ కప్-2024లో శ్రీలంక గ్రూప్ దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. అనంతరం ఓటమికి బాధ్యత వహిస్తూ హసరంగా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో ఎడమచేతి వాటం బ్యాటర్ చరిత్ అసలంకను నియమించారు. అసలంక మూడు టెస్టులు, 59 వన్డేలు, 47 టీ20లు ఆడాడు. పొట్టి ఫార్మాట్‌లో 1061 పరుగులు చేశాడు.

IND vs SL Charith Asalanka to Captain Sri Lanka in T20I Series Against India


అయితే జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. సీనియర్ ప్లేయర్లు ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డిసిల్వాను జట్టు నుంచి తప్పించారు. మరోవైపు దినేశ్ చండిమాల్, కుసల్ పెరీరా, అవిష్క ఫెర్నాండో జట్టులోకి తిరిగి వచ్చారు. అలాగే సమరవిక్రమ, దిల్షాన్ మధుశంక సెలక్టర్లు మొండిచేయి చూపించారు. లంక ప్రీమియర్ లీగ్‌లో అవిష్క అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు.

శ్రీలంక టీ20 జట్టు: చరిత్ అసలంక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్, దినేష్ చండిమాల్, కామిందు మెండిస్, దసున్ షనక, వానిందు హసరంగా, దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, చమిందు విక్రమసింఘే, మతీషా పతిరనా, నువాన్ తుషారా, దుష్మాంత చమీర, బినూర ఫెర్నాండో.

భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, రిషభ్ పంత్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్.

Story first published: Tuesday, July 23, 2024, 12:47 [IST]
Other articles published on Jul 23, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+