న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

41 ఏళ్ల త‌ర్వాత టీమిండియా అరుదైన రికార్డు.. ఇది రెండోసారి మాత్ర‌మే!!

IND vs SL: 5 Debutants Playing For India in 3rd ODI Match after 41 years
Ind Vs SL : Five Debutants For Teamindia.. ఇది రెండోసారి మాత్రమే | Oneindia Telugu

కొలంబో: ప్రేమదాస మైదానంలో భారత్‌, శ్రీలంక జట్ల మధ్య మూడో వన్డే ప్రారంభం అయింది. టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్ శిఖర్‌ ధావన్‌ మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఈ మ్యాచులో ఏకంగా ఐదుగురు ప్లేయ‌ర్స్‌ భారత్ తరఫున వన్డే అరంగేట్రం చేశారు. మొత్తంగా ధావన్ మూడో వ‌న్డేలో ఆరు మార్పులు చేయగా.. అందులో ఐదుగురు కొత్త ప్లేయ‌ర్స్‌ ఉన్నారు. వికెట్ కీపర్ సంజు శాంసన్‌, బ్యాట్స్‌మన్‌ నితీశ్‌ రాణా, పేసర్ చేతన్‌ సకారియా, ఆల్‌రౌండర్‌ కృష్ణప్ప గౌతమ్‌, స్పిన్నర్ రాహుల్‌ చహర్‌ తొలి వన్డే ఆడుతున్నారు. దీంతో భారత్ ఓ రికార్డు నెలకొల్పింది. ఇలా ఒకే మ్యాచ్‌లో ఐదుగురు ప్లేయ‌ర్స్ భారత్ త‌ర‌ఫున అరంగేట్రం చేయ‌డం 41 ఏళ్ల త‌ర్వాత ఇదే మొదటిసారి.

'కారణం ఎంఎస్ ధోనీ కాదు.. నేను బాగా ఆడకపోవడం వల్లే జట్టు నుంచి తొలగించారు''కారణం ఎంఎస్ ధోనీ కాదు.. నేను బాగా ఆడకపోవడం వల్లే జట్టు నుంచి తొలగించారు'

1980-81లో ఇలా ఒకే వ‌న్డేలో ఐదుగురు కొత్త వాళ్ల‌కు తొలిసారి టీమిండియా అవకాశం ఇచ్చింది. అప్పుడు మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో భారత్ మ్యాచ్ ఆడింది. మ‌ళ్లీ 41 ఏళ్ల ఐదుగురు కొత్త ప్లేయ‌ర్స్‌ భారత జట్టులో అరంగేట్రం చేశారు. ఆస్ట్రేలియాతో జ‌రిగిన ఆ మ్యాచ్‌లో 66 ప‌రుగుల‌తో టీమిండియా విజయం సాధించ‌డం విశేషం. ఇప్ప‌టికే సిరీస్ గెల‌వ‌డంతో శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో భారీ మార్పులు చేసింది టీమిండియా.

శ్రీలంకతో జరుగుతున్న చివరి వన్డేలో భారత జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 28 పరుగులు వద్ద కెప్టెన్ శిఖర్ ధావన్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. చమీర బౌలింగ్‌లో భనుకకు క్యాచ్ ఇచ్చి గబ్బర్ పెవిలియన్ చేరాడు. 11 బంతులు ఆడిన ధావన్ 3 ఫోర్లతో 11 పరుగులు చేశాడు. ఆపై ధాటిగా ఆడిన పృథ్వీ షా (49, 49 బంతుల్లో 8x4) హాఫ్ సెంచరీకి ఒక పరుగు దూరంలో ఔట్ అయ్యాడు. ఆపై సంజు శాంసన్ (46, 46 బంతుల్లో 5x4, 1x6) కూడా ఔట్ అయ్యాడు. ప్రస్తుతం 21 ఓవర్లు ముగిశాయి. భారత్ మూడు నష్టానికి 132 పరుగులు చేసింది. సూర్య, పాండే క్రీజులో ఉన్నారు.

తుది జట్లు:
భారత్: శిఖర్ ధావన్ (కెప్టెన్), పృథ్వీ షా, సంజూ శాంసన్ (కీపర్), మనీశ్ పాండే, సూర్యకుమార్ యాదవ్, నితీష్ రాణా, హార్దిక్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్, రాహుల్ చహర్, నవ్‌దీప్ సైనీ, చేతన్ సకారియా.

శ్రీలంక: అవిష్క ఫెర్నాండో, మినోద్‌ భానుక, భానుక రాజపక్స, ధనంజయ డిసిల్వా, చరిత్‌ అసలంక, దసున్‌ షనక (కెప్టెన్‌), రమేష్ మెండిస్, చమిక కరుణరత్నే, అకిలా దనంజయ, దుష్మంత చమీరా, ప్రవీణ్ జయవిక్రమ.

Story first published: Friday, July 23, 2021, 16:39 [IST]
Other articles published on Jul 23, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X