For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SL 3rd T20I:సిరీస్‌పై కన్నేసిన శ్రీలంక! సైనీ ఔట్.. నెట్ బౌలర్ అరంగేట్రం! తుది జట్లు ఇవే!!

IND vs SL 3rd T20: India Playing 11, Sri Lanka Playing 11 And Match Prediction
Ind Vs SL T20: Teamindia Batsmen నలుగురే.. తుడిజట్టు ఇదే | Oneindia Telugu

కొలంబో: భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ రసవత్తరంగా మారింది. కరోనా కలకలంతో ఒకరోజు ఆలస్యంగా బుధవారం జరిగిన రెండో టీ20లో టీమిండియా ఓటమి పాలైంది. ప్రధాన ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో.. ఉన్న వనరులతోనే బరిలోకి దిగిన ధావన్‌ సేన ఉత్కంఠ పోరులో ఓటమిని ఎదుర్కొంది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ 1-1తో సమం అయింది. ఈరోజు ఇరు జట్ల మధ్య సిరీస్‌ విజేతను నిర్ణయించే మూడో టీ20 మ్యాచ్ జరగనుంది.

టీమిండియాకు స్టార్ ప్లేయర్స్ అందుబాటులో లేకపోవడంతో.. ఈ మ్యాచులో లంక ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. అదే ఊపులో మూడో మ్యాచ్ కూడా గెలిచి వన్డే సిరీస్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని లంక భావిస్తోంది. అయితే భారత జట్టులో సగానికి పైగా కొత్తవాళ్లే అయినా.. ఐపీఎల్ అనుభవం ఉండడం కలిసొచ్చే అంశం.

ఆప్షన్ లేకుండా పోయింది

ఆప్షన్ లేకుండా పోయింది

టీమిండియా ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యాకు కరోనా సోకడంతో మంగళవారం జరగాల్సిన మ్యాచ్ బుధవారానికి వాయిదా పడింది. కృనాల్‌తో సన్నిహితంగా మెలిగిన ఎనిమిది మంది ఆటగాళ్లు మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోయారు. దీంతో రెండో టీ20లో భారత్‌ నలుగురు (దేవ్‌దత్‌ పడిక్కల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, చేతన్ సకారియా, నితీష్‌ రాణా) కొత్త కుర్రాళ్లను బరిలో దింపింది. స్టాండ్‌బైగా ఎంపిక చేసిన వారిలోనూ చెప్పుకోదగ్గ ఆటగాళ్లు లేకపోవడంతో.. రెండో టీ20లో కేవలం ఐదుగురు స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మెన్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇంకొకరిని తీసుకుందామనుకున్నా.. ఆప్షన్ లేకుండా పోయింది.

సాయి కిషోర్ అరంగేట్రం

సాయి కిషోర్ అరంగేట్రం

రెండో టీ20లో దేవ్‌దత్‌ పడిక్కల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, శిఖర్ ధావన్ పర్వాలేదనిపించినా.. సంజు శాంసన్, నితీష్ రాణా విఫలమయ్యారు. శాంసన్, నితీష్ గాడిలో పడాల్సి ఉంది. టాప్-5 రాణిస్తేనే భారత్ భారీ స్కోర్ చేయగలదు. పడిక్కల్‌, గైక్వాడ్‌, రాణాలకు ఐపీఎల్ అనుభవం ఉండడం టీమిండియాకు కలిసొచ్చే అంశం.

వచ్చిన అవకాశాన్ని ఇప్పటికైనా శాంసన్ సద్వినియోగం చేసుకుంటేనే మరోసారి జట్టులో చోటు దక్కనుంది. సెంచరీ చేస్తే తప్ప అతడికి మరో అవకాశం రాదు. రెండో టీ20లో గాయపడ్డ పేసర్ నవదీప్ సైనీ.. చివరి మ్యాచుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో స్టాండ్‌బైగా ఎంపికైన తమిళనాడు లెగ్ స్పిన్నర్ రవిశ్రీనివాసన్ సాయి కిషోర్ భారత జట్టులోకి అరంగేట్రం చేయనున్నాడు. దీంతో నలుగురు స్పినర్లతో భారత్ బరిలోకి దిగనుంది.

లంకకు పెద్ద కష్టమేమి కాకపోవచ్చు

లంకకు పెద్ద కష్టమేమి కాకపోవచ్చు

ప్రస్తుతం టీమిండియాతో పోలిస్తే.. శ్రీలంక జట్టు పటిష్టంగా ఉంది. బలహీన భారత జట్టుపై విజయం లంకకు పెద్ద కష్టమేమి కాకపోవచ్చు.

అవిష్క ఫెర్నాండో, మినోద్ భానుక, సదీరా సమరవిక్రమా, దనుంజయ డిసిల్వా, రమేశ్ మెండీస్, డసన్ షనకలతో బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉంది. అవిష్క, సమరవిక్రమా, షనక బ్యాట్ జులిపించాల్సి ఉంది. ఇక ఇసురు ఉడానా, దుష్మంత చమీరా, అకిలా ధనుంజయతో బౌలింగ్ కూడా బాగుంది. మూడో టీ20కి లంక ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు. రెండో టీ20లో బరిలోకి దిగిన జట్టే చివరి మ్యాచ్ ఆడనుంది.

IND vs SL 3rd T20I:భారత్-శ్రీలంక చివరి టీ20 నేడే.. డ్రీమ్ 11 ప్రిడిక్షన్స్, కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!!

పిచ్ రిపోర్ట్

పిచ్ రిపోర్ట్

ప్రేమదాస మైదానం పిచ్ చాలా నెమ్మదించింది. గత రెండు మ్యాచుల్లో ఇదే స్పష్టమైంది. స్పిన్నర్లకు అనుకూలంగా మారింది. బంతి టర్న్ అయ్యే అవకాశం బాగా ఉంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 150 స్కోర్ కూడా కాపాడుకోవచ్చు. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోనుంది. కొలంబోలో సగటున 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండనుంది. కాబట్టి మ్యాచుకు వర్షం ముప్పు లేదు. కొలంబోలోని ప్రేమదాస మైదానంలో ఈ రోజు మ్యాచ్ జరగనుంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. సోనీ స్పోర్ట్ ఇండియాలో మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ రానుంది.

తుది జట్లు (అంచనా)

తుది జట్లు (అంచనా)

భారత్: శిఖర్ ధావన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ , దేవదత్ పడిక్కల్, సంజూ శాంసన్ (కీపర్), నితీశ్ రాణా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, రాహుల్ చహర్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, వరుణ్ చక్రవర్తి, చేతన్ సకారియా.

శ్రీలంక: అవిష్క ఫెర్నాండో, మినోద్ భానుక (కీపర్), సదీరా సమర విక్రమా, దనుంజయ డిసిల్వా, రమేశ్ మెండీస్, డసన్ షనక (కెప్టెన్), చమిక కరుణరత్నే, వానిందు హసరంగ, ఇసురు ఉడానా, దుష్మంత చమీరా, అకిలా ధనుంజయ.

Story first published: Thursday, July 29, 2021, 12:28 [IST]
Other articles published on Jul 29, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+