Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL 3rd ODI: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. ఏకంగా ఐదుగురు అరంగేట్రం!!

IND vs SL 3rd ODI Toss: India Won The Toss And Opts To Bat, India And Sri Lanka Playing 11 Is Out

కొలంబో: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా కొలంబోని ప్రేమదాస మైదానంలో మరికొద్ది సేపట్లో భారత్-శ్రీలంక జట్ల మధ్య చివరిదైన మూడో వన్డే మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శిఖర్ ధావన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం తుది జట్టులో భారత కెప్టెన్ ధావన్ పలు మార్పులు చేశాడు. ఏకంగా ఐదుగురు ఆటగాళ్లు భారత్ తరఫున అరంగేట్రం చేస్తున్నారు. సంజు శాంసన్, నితీష్ రాణా, కృష్ణప్ప గౌతమ్, చేతన్ సకారియా, రాహుల్ చహర్ మొదటిసారి వన్డే క్యాప్ అందుకున్నారు. ఇక నవదీప్‌ సైనికీ జట్టులో చోటు దక్కింది. మరోవైపు లంక మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది.

బౌలర్‌ దీపక్‌ చహర్‌ అసమాన బ్యాటింగ్‌తో రెండో వన్డేలో గెలిచిన భారత్‌.. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. మూడో వన్డే మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని ధావన్ సేన చూస్తోంది. మరోవైపు ఆఖరి పోరులోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని లంక పట్టుదలగా ఉంది. ఇక ఈ ఏడాది జరుగనున్న టీ20 ప్రపంచకప్‌నకు ముందు భారత్ ఆడుతున్న చివరి పరిమిత ఓవర్ల సిరీస్‌ ఇదే కాగా.. మెగా టోర్నీ జట్టులో చోటు దక్కించుకోవాలని యువ ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు.

తుది జట్లు:
భారత్: శిఖర్ ధావన్ (కెప్టెన్), పృథ్వీ షా, సంజూ శాంసన్ (కీపర్), మనీశ్ పాండే, సూర్యకుమార్ యాదవ్, నితీష్ రాణా, హార్దిక్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్, రాహుల్ చహర్, నవ్‌దీప్ సైనీ, చేతన్ సకారియా.

శ్రీలంక: అవిష్క ఫెర్నాండో, మినోద్‌ భానుక, భానుక రాజపక్స, ధనంజయ డిసిల్వా, చరిత్‌ అసలంక, దసున్‌ షనక (కెప్టెన్‌), రమేష్ మెండిస్, చమిక కరుణరత్నే, అకిలా దనంజయ, దుష్మంత చమీరా, ప్రవీణ్ జయవిక్రమ.

Story first published: Friday, July 23, 2021, 14:50 [IST]
Other articles published on Jul 23, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+