న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SL: కరోనా దెబ్బ.. సూర్య, షా, హార్దిక్, ఔట్.. బెంచ్ ఆటగాళ్లే టీమిండియాకు దిక్కు.. తుది జట్లు ఇవే!

IND vs SL 2nd T20: India Playing 11, Sri Lanka Playing 11 And Match Prediction
IND VS SL 2nd T20: 9 Indian players will not play in this match

కొలంబో: కరోనా మహమ్మారి టీమిండియాలో కలకలం రేపింది. శ్రీలంకతో రెండో టీ20 మ్యాచ్‌కు ముందు స్పిన్‌ ఆల్‌రౌండర్‌ కృనాల్ పాండ్యా పాజిటివ్‌గా తేలాడు. దీంతో మంగళవారం జరగాల్సిన మ్యాచ్‌ను నేటి(బుధవారం)కి వాయిదా వేశారు. కృనాల్ను ఏడు రోజుల క్వారంటైన్‌కు పంపడంతో.. అతడు పొట్టి సిరీస్‌కు దూరమయ్యాడు. కాగా, పాండ్యాతో సన్నిహితంగా మెలిగిన ఎనిమిది మందికి నిర్వహించిన ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షల్లో నెగెటివ్‌ ఫలితం వచ్చింది. అయినా, వీరు బుధవారం జరిగే రెండో టీ20కి అందుబాటులో ఉండరు. ఆ ఎనిమిది మంది ఎవరనేది ప్రకటించకపోయినప్పటికీ.. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షా, ఇషాన్ కిషన్, దేవదత్ పడిక్కల్, కృష్ణప్ప గౌతమ్‌గా తెలుస్తోంది. దాంతో భారత్ 9 మార్పులతో బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరోవైపు టీ20ల్లో తమ వరుస పరాజయాలకు అడ్డుకట్ట వేయాడానికి ఇదే అదునుగా శ్రీలంక భావిస్తోంది. ఆ జట్టు గత 14 మ్యాచ్‌ల్లో కేవలం ఒకేదాంట్లో గెలిచింది. దాంతో బలహీనమైన భారత్‌పై ఈ మ్యాచ్‌‌లో ఎలాగైన గెలిచి సిరీస్‌లో నిలవడంతో పాటు తమ రికార్డును మెరుగు చేసుకోవాలని భావిస్తోంది.

జట్టులో నుంచి 9 మంది ఔట్!

జట్టులో నుంచి 9 మంది ఔట్!

టీ20 ప్రపంచకప్ ముందు ఈ సిరీస్‌ను సన్నాహకంగా భావిస్తున్న టీమిండియాకు కరోనా రూపంలో పెద్ద గండం ఎదురైంది. పూర్తిగా బెంచ్ ఆటగాళ్లతో బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా కారణంగా ఒకేసారి 9 మంది ఆటగాళ్లు జట్టుకు దూరం కానున్నారు. దాంతో రుతురాజ్ గైక్వాడ్, నితీశ్ రాణా, చేతన్ సకారియాలకు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయడానికి మార్గం సుగుమమైంది. అయితే కృనాల్‌కు సన్నిహితంగా ఉన్న ఆటగాళ్లు ఎవరా? అనేదానిపై అధికారిక సమాచారం లేకపోవడంతో తుది జట్టు ఎలా ఉండబోతుందని చెప్పడం కష్టమే. కానీ శ్రీలంక క్రికెట్ వర్గాల సమాచారం భారత్ ఈ మ్యాచ్‌లో పూర్తిగా బెంచ్‌ బలంపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది.

శ్రీలంక బదులిచ్చెనా?

శ్రీలంక బదులిచ్చెనా?

తొలి వన్డేలో చిత్తుగా ఓడినా శ్రీలంక.. రెండో వన్డేలో ఓడినా స్పూర్తిదాయక పోరాటం కనబర్చింది. మూడో వన్డేలో ఆల్‌రౌండ్ షోతో విజయాన్నందుకుంది. కానీ తొలి టీ20లో ఆ జోరును కొనసాగించలేకపోయింది. బౌలర్లు చెలరేగినా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. చరిత్ అసలంక ఒంటరి పోరాటం చేసినా అతనికి మరో ఎండ్ నుంచి సహకారం లభించలేదు. బౌలర్లకు అండగా బ్యాట్స్‌మన్ చెలరేగితే ఆ జట్టు గట్టి పోటీనివ్వవచ్చు. తొలి టీ20లో విఫలమైన అషెన్ బండారాపై వేటు పడవచ్చు. అయితే శ్రీలంక క్యాంప్‌ను గాయాల బెడద వేదిస్తుందన్న వార్తల నేపథ్యంలో జట్టులో భారీ మార్పులే చోటు చేసుకోవచ్చు. అయితే గాయాలపై లంక బోర్డు అధికారిక ప్రకటన అయితే చేయలేదు.

పిచ్/వెదర్ రిపోర్ట్

పిచ్/వెదర్ రిపోర్ట్

ఫస్ట్ టీ20 మాదిరే పిచ్ స్పిన్నర్లకు అనుకూలించనుంది. పవర్ ప్లే రూల్స్‌ను ఉపయోగించుకుంటూ కొత్త బంతితోనే బ్యాట్స్‌మన్ పరుగులు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మిడిల్ ఓవర్లలో వికెట్‌పై టర్న్ లభిస్తుండటంతో స్పిన్నర్లు చెలరేగనున్నారు. బ్యాట్, బంతి మధ్య ఆసక్తికర పోరు నడవనుంది. దాంతో టాస్ గెలిచిన జట్లు ఫీల్డింగ్‌కే మొగ్గు చూపవచ్చు. ఈ వికెట్‌పై 160 పరుగులే మంచి స్కోర్. ఇక ఈ మ్యాచ్‌కు వర్ష సూచనలేదు. కాకపోతే మ్యాచ్ జరిగే సమయంలో మైదానాన్ని మేఘాలు కమ్ముకునే అవకాశం ఉంది. రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

తుది జట్లు (అంచనా)

తుది జట్లు (అంచనా)

భారత్: పృథ్వీ షా, శిఖర్ ధావన్(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తీ, యుజ్వేంద్ర చాహల్

శ్రీలంక: అవిష్క ఫెర్నాండో, మినోద్ భానుక(కీపర్), ధనుంజయ డి సిల్వా, చరిత అసలంక, అషెన్ బండారా/బానుక రాజపక్స, డసన్ షనక(కెప్టెన్), చమిక కరుణరత్నే, వానిందు హసరంగ, ఇసురు ఉడానా, దుష్మంత చమీరా, అకిలా ధనుంజయ

Story first published: Wednesday, July 28, 2021, 10:10 [IST]
Other articles published on Jul 28, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X